AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: భార్యను చంపేశాడని భర్తను జైల్లో వేశారు.. తీరా ఆమె ఆచూకీ తెలిసి పోలీసులు షాక్.. అంతే కాకుండా

బిహార్(Bihar) కు చెందిన ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. భర్తే ఆమెను హత్య చేశారన్న ఆరోపణలతో పోలీసులు సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో...

Bihar: భార్యను చంపేశాడని భర్తను జైల్లో వేశారు.. తీరా ఆమె ఆచూకీ తెలిసి పోలీసులు షాక్.. అంతే కాకుండా
Arrest
Ganesh Mudavath
|

Updated on: May 05, 2022 | 1:49 PM

Share

బిహార్(Bihar) కు చెందిన ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. భర్తే ఆమెను హత్య చేశారన్న ఆరోపణలతో పోలీసులు సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. ఆమె చనిపోలేదని తెలిసి అవాక్కయ్యారు. అంతేకాదు.. ఆమె తన ప్రియుడితో కలిసి నివసిస్తోందని తెలిసి విస్తుపోయారు. వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ మహిళను బిహార్ కు తీసుకువచ్చారు. బిహార్ మోతిహారి(Motihari) జిల్లాకు చెందిన శాంతి దేవి 2016లో దినేశ్ రామ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత శాంతి ఏప్రిల్ 19 న తన భర్త ఇంటి నుంచి అదృశ్యమైంది. మహిళ అదృశ్యం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరకట్న వేధంపులతో భర్తే తమ కుమార్తెను హత్య చేసి అదృశ్యమైందని చెబుతున్నాడని ఆరోపించారు.

బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేశ్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుకు సంచలన విషయాలు తెలిశాయి. శాంతి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా టెక్నాలజీ ఉపయోగించి ఆమె జాడను కనుగొన్నారు. చనిపోయినట్లు భావిస్తున్న మహిళ.. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తన ప్రేమికుడితో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఓ బృందం ఏర్పాటు చేశారు. వారు జలంధర్ వెళ్లి సదరు మహిళను మోతిహరీకి తీసుకువచ్చారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Trending: ఒకవేళ ఉంటే.. ఇక ఎందుకు చిక్కవు..?.. ఏలియన్స్‌ను ఆకర్షించడానికి నగ్న చిత్రాలు.!

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..

Rahul vs KTR: నేను సిద్ధమే.. నీవు సిద్ధమా.. రాహుల్‌‌కు కేటీఆర్ వైట్‌ చాలెంజ్‌.. భాగ్యనగరంలో బ్యానర్ల పంచాయితీ!