AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart-breaking: ప్రభుత్వాసుపత్రిలో హృదయవిదాకర ఘటన.. నవజాత శిశువు అవయవాలను కొరుకుతున్న ఎలుకలు..!

జార్ఖండ్‌ రాష్ట్రంలో హృదయవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును ఎలుకలు పీక్కతిన్న దుస్థితి ఎదురైంది.

Heart-breaking: ప్రభుత్వాసుపత్రిలో హృదయవిదాకర ఘటన.. నవజాత శిశువు అవయవాలను కొరుకుతున్న ఎలుకలు..!
Newborn Baby
Balaraju Goud
|

Updated on: May 05, 2022 | 1:41 PM

Share

A heart-breaking event in Jharkhand: జార్ఖండ్‌ రాష్ట్రంలో హృదయవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును ఎలుకలు పీక్కతిన్న దుస్థితి ఎదురైంది. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన గిరిదిహ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. నవజాత శిశువు మోకాళ్లు, అవయవాలను ఎలుకలు కొరికి తినేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఇద్దరు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల నుండి తొలగించారు. ధన్‌బాద్‌కు చెందిన షాహిద్ నిర్మల్ మెహతా అనే బాలిక పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్ (SNMMCH) ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

గిరిడి ఆసుపత్రిలోని మోడల్ మాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) వార్డులో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా.. ఎలుకలు కొరకడంతో బాలిక మోకాలికి బలమైన గాయమైందని అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి మమతా దేవి తెలిపారు. ఏప్రిల్ 29న పాప పుట్టగా, పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఎంసీహెచ్‌లో చేర్చారు.

ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చర్యలకు సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు. SNMMCH లోని పీడియాట్రిక్స్ విభాగం అధిపతి అవినాష్ కుమార్ మాట్లాడుతూ, “శిశువు మోకాలిపై లోతైన గాయాలను గుర్తించాం. గాయం లోతుగా ఉన్నందున, రోగిని చూడవలసిందిగా సర్జన్‌ను కోరారు.” అని తెలిపారు. అదే సమయంలో, గిరిదిహ్ సదర్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై చర్య తీసుకోవాలని జార్ఖండ్ ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శికి గిరిడి డిప్యూటీ కమిషనర్ నమన్ ప్రియేష్ లక్రా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదొక్కటే కాదు, రాష్ట్రంలోని వైద్య కళాశాలల మార్చురీలో మృతదేహాలకు రక్షణ కరవైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదిరోజుల క్రితం అమెరికా పౌరుడు మార్కోస్ లాథర్‌డేల్ మృతదేహన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద వైద్య కళాశాల అయిన రిమ్స్‌కు తరలించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన అతని స్నేహితుడు కైలాష్ యాదవ్ మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. రిమ్స్ మార్చురీలో బాగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహన్ని గుర్తించారు. ఇలాగానే, రిమ్స్‌లో అనేక మృతదేహాలు కుళ్లిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇక్కడ మార్చురీలో ఉన్న డీప్ ఫ్రీజర్ పాడైపోయింది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా వ్యవస్థను సరిదిద్దడంలో ఎవరూ దృష్టి సారించడం లేదని మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!