Viral: మర్డర్ కేసు విచారణ..ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి.. చిక్కుల్లో పోలీసులు

Monkey steals murder evidence: సర్వ సాధారణంగా.. ఎవరైనా నేరం చేసినా , ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు. అయితే మనిషి..

Viral: మర్డర్ కేసు విచారణ..ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి.. చిక్కుల్లో పోలీసులు
Jaipur Case
Follow us

|

Updated on: May 05, 2022 | 12:33 PM

Monkey steals murder evidence: సర్వ సాధారణంగా.. ఎవరైనా నేరం చేసినా , ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు. అయితే మనిషి చేసిన నేరానికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు నాశనం చేస్తే ఎలా ఉంటుంది. అదీ పోలీసులు ఎంతో కష్టపడి సేకరించిన ఓ హత్యకు సంబంధించిన కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోతి దొంగిలిస్తే.. ఏ విధంగా ఉంటుంది.. ఊహకు అందని విషయం కదా.. హత్యాయుధంతో పాటు ఓ కేసుకు సంబంధించిన మరో 15 సాక్ష్యాలను కోతి దొంగిలించింది. పోలీసులు 2016నాటి కేసుకు సంబంధించిన తాము సేకరించిన సాక్ష్యాధారాలను బ్యాగ్ లో పెట్టి.. ఆ బ్యాగ్ ను కోర్టు ఆవరణలోని చెట్టు కింద ఉంచారు. ఓ కోతి ఆ బ్యాగ్ ను తీసుకుని పారిపోయింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.  జైపూర్‌ లోని ట్రయల్ కోర్టులో రాజస్థాన్ పోలీసులు ఈ వాంగ్మూలం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016 సెప్టెంబర్‌లో చందవాజీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శశికాంత్‌ శర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం లభ్యమైన తర్వాత, మృతుడి బంధువులు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ జైపూర్-ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఐదు రోజుల తర్వాత, పోలీసులు చాంద్‌వాజీ నివాసితులు రాహుల్, మోహన్‌లాల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. హత్యానేరం కింద పోలీసులు వారిద్దరినీ జిల్లా అదనపు జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో సాక్ష్యాలను సమర్పించే సమయం వచ్చినప్పుడు, ఒక కోతి హత్య సాక్ష్యాలను దొంగిలించిందని పోలీసులు చెప్పారు. ప్రాథమిక సాక్ష్యంగా ఉన్న కత్తిని కూడా కోతి తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఎలా జరిగిందంటే: 

ఈ హత్యాకేసుకు సంబంధించిన సాక్ష్యాలను బ్యాగ్‌లో ఉంచామని, వాటిని కోర్టుకు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అందులో కత్తితో పాటు మరో 15 ముఖ్యమైన ఆధారాలను కూడా ఉంచారు. మల్ఖానాలో స్థలం లేకపోవడంతో సాక్ష్యాధారాలతో కూడిన సంచిని చెట్టుకింద ఉంచారు. అయితే విచారణ సమయంలో కోర్టు ఆధారాలు సమర్పించాలని పోలీసులను కోరగా.. అప్పుడు తాము సేకరించిన అధరాలు బ్యాగ్ లో పెట్టినట్లు.. ఆ బ్యాగ్‌ని కోతి దొంగిలించిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దొంగిలించబడిన వస్తువులలో హత్యాయుధం (రక్తంతో తడిసిన కత్తి) ఉందని చెప్పారు. ఈ సమాచారాన్ని పోలీసులు కోర్టు ముందు లిఖితపూర్వకంగా కూడా సమర్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా దళాల దాడి.. డాన్‌బాస్‌లో 21 మంది పౌరుల మృతి

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు