India Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నిన్న ఒక్కరోజే 3వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3 వేల 275 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

India Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నిన్న ఒక్కరోజే 3వేలకు పైగా కేసులు
Follow us
Balaraju Goud

|

Updated on: May 05, 2022 | 11:21 AM

India Covid 19: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3 వేల 275 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా రాకాసి కోరలకు చిక్కిన 55 మంది ప్రాణాలు విడిచారు. అదే సమయంలో నిన్న మూడు వేల 10 మంది వైరస్ నుంచి కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 719కి పెరిగింది. అదే సమయంలో, ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 23 వేల 975 కు పెరిగింది. డేటా ప్రకారం, ఇప్పటివరకు 4 కోట్ల 25 లక్షల 47 వేల 699 మంది ఇన్ఫెక్షన్ ఫ్రీ అయ్యారు.

అదే సమయంలో, పంజాబ్‌లోని పాటియాలాలోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (RGNUL)లోని 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. సోకిన విద్యార్థులు తేలికపాటి లక్షణాలను గుర్తించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ బారినపడ్డ విద్యార్థులందరినీ వివిధ బ్లాకులలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మే 10లోగా హాస్టల్‌ను ఖాళీ చేయాలని యూనివర్సిటీ అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండి

అటు దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 1,354 కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరొకరు మరణించారు. అయితే కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రేటు 7.64 శాతంకు చేరుకుంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకారం, మంగళవారం నగరంలో 17 వేల 732 నమూనాలను పరీక్షించారు. బుధవారం నమోదైన కొత్త కేసులతో కలిపి మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,88,404కి చేరుకోగా, మృతుల సంఖ్య 26,177కి పెరిగింది. ప్రస్తుతం నగరంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 5,853కు చేరుకుంది. ప్రస్తుతం, కోవిడ్ -19 బారినపడ్డ వారిలో 180 మంది రోగులు ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులలో చేరగా, 4,319 మంది ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటివరకు 189 కోట్లకు పైగా యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వడం జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 13 లక్షల 98 వేల 710 డోసులు ఇవ్వగా, దీంతో ఇప్పటి వరకు 189 కోట్ల 63 లక్షల 30 వేల 362 డోసుల వ్యాక్సిన్‌ను అందించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క డేటా ప్రకారం, బుధవారం సాయంత్రం 7 గంటల వరకు, 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారికి మొత్తం 43 వేల 28 ముందు జాగ్రత్త మోతాదులు ఇవ్వడం జరిగింది. ఈ వయస్సులో ముందు జాగ్రత్త మోతాదు తీసుకునే వారి సంఖ్య 9 లక్షల 4 వేల 586కు పెరిగింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!