Viral Video: వామ్మో.. వీళ్లు కరోనా కంటే డేంజర్‌గా ఉన్నట్లున్నారే.. కొవిడ్ పరీక్షలు ఎలా చేస్తున్నారో మీరే చూడండి..
Coronavirus: కరోనా మహమ్మారి (Corona Virus) పురుడు పోసుకున్న చైనాలో మరోసారి వైరస్ విజృభిస్తోంది. ఆర్థిక రాజధాని షాంఘై లాంటి నగరాల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్‌ను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ వంటి పలు ఆంక్షలు విధిస్తోంది.
Coronavirus: కరోనా మహమ్మారి (Corona Virus) పురుడు పోసుకున్న చైనాలో మరోసారి వైరస్ విజృభిస్తోంది. ఆర్థిక రాజధాని షాంఘై లాంటి నగరాల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్‌ను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ వంటి పలు ఆంక్షలు విధిస్తోంది. ప్రజలు బయట కనిపిస్తే చాలు ఏదో జంతువులను పట్టుకున్నట్లుగా పట్టుకుని ఐసోలేషన్ లోకి నెట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కరోనా లక్షణాలు లేకున్నా క్వారంటైన్‌లోకి పంపిస్తున్నారు. దీంతో కరోనా కంటే లాక్‌డౌన్ ఆంక్షలంటేనే ఎక్కువ హడలిపోతున్నారు చైనీయులు. వరుస లాక్‌డౌన్‌లతో వారిలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. కాగా అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో చైనా (China) ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ (Zero Covid Policy) పేరుతో మరిన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా కరోనా పరీక్షల పేరుతో వారిని తెగ ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టకుండా బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఓ మహిళను బలవంతంగా టెస్టింగ్ సెంటర్‌లో కూర్చోబెట్టి, కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె పరీక్షలు చేయించుకోవటానికి, నమూనాలు ఇవ్వడానికి సహకరించటంలేదు. దీంతో వైద్య సిబ్బంది ఆమె మీద కూర్చుని మరీ నమూనాలు సేకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు చైనాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏ ప్రాంతంలోనిది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే షాంఘైలోనే ఇలా బలవంతంగా కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.
这个强行检测姿势应该让全世界看一看?? pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i??iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
Chinese government will break your home to force you take a Covid test and vaccine pic.twitter.com/NHzS9pnaWX
— Songpinganq (@songpinganq) March 19, 2022
మరిన్ని కరోనా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..
Lemon water: ప్రతి రోజూ ఒక గ్లాస్ లెమన్ వాటర్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..