AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇతనికి ఫిట్‌నెస్‌ అంటే ఎంత ప్రేమో.. కింద పడిపోయినా ఆపట్లేదుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..

కరోనా కారణంగా మన జీవితాల్లో వ్యాయామం భాగమైపోయింది. ఈవైరస్‌ ప్రభావంతో చాలామంది జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తోంటే సమయం లేనివారు మాత్రం ఇంట్లోనే వర్కవుట్లు చేస్తున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరగడమే కాకుండా పని ఒత్తిడి, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాగా జిమ్‌లో కానీ ఎక్కడైనా కానీ వర్కవుట్లు చేసేటప్పుడు ఒక్కోసారి ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా పుషప్‌లు, క్రంచెస్‌లు చేసేటప్పుడు అత్యుత్సాహానికి పోయి ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు అలాంటి […]

Viral Video: ఇతనికి ఫిట్‌నెస్‌ అంటే ఎంత ప్రేమో.. కింద పడిపోయినా ఆపట్లేదుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Basha Shek
|

Updated on: May 05, 2022 | 3:31 PM

Share

కరోనా కారణంగా మన జీవితాల్లో వ్యాయామం భాగమైపోయింది. ఈవైరస్‌ ప్రభావంతో చాలామంది జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తోంటే సమయం లేనివారు మాత్రం ఇంట్లోనే వర్కవుట్లు చేస్తున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరగడమే కాకుండా పని ఒత్తిడి, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాగా జిమ్‌లో కానీ ఎక్కడైనా కానీ వర్కవుట్లు చేసేటప్పుడు ఒక్కోసారి ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా పుషప్‌లు, క్రంచెస్‌లు చేసేటప్పుడు అత్యుత్సాహానికి పోయి ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. బాగా లావుగా ఉన్న ఓ వ్యక్తి సరదాగా వ్యాయామం చేసేందుకు రోడ్డుపైకి వస్తాడు. పొట్టను తగ్గించుకోవడంలో భాగంగా అక్కడున్న ఓ దిమ్మెను ఆసరాగా చేసుకుని క్రంచెస్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. దిమ్మెపైనే పడుకుని కాళ్లు, చేతులు కిందికిపైకి ఊపుతూ వ్యాయామాలు చేస్తాడు. అయితే కాళ్లు పైకి లేపగానే బ్యాలెన్స్ తప్పిన అతడు దిమ్మెపై నుంచి కిందపడిపోతాడు. ఆ సమయంలో దిక్కుముక్కలు చూసిన అతను కవర్‌ చేసేందుకు మోకాళ్లపైనే కూర్చొని పుషప్‌లు చేయడానికి ప్రయత్నిస్తాడు.

దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశాడు.. ‘ప్రారంభం ఎలా ఉన్నా.. ముగింపు మాత్రం అద్భుతంగా ఉండాలి. గుడ్‌మార్నింగ్’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చుసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇక నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘ఫెయిలైనా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండండి’, ‘ఫిట్‌గా ఉండడం కోసం ఈ ఫిట్‌నెస్‌ ప్రియుడి అంకితభావం మెచ్చుకోవాల్సిందే’, అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Best Food: జిమ్ చేసిన తర్వాత ఈ ఫుడ్ తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Sarkaruvaari Paata: ఆర్‌ఆర్ఆర్‌, కేజీఎఫ్‌2 బాటలోనే సర్కారు వారి పాట.. మహేశ్‌ సినిమా ఎంతసేపు ఉండనుందంటే..