AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య (Darshanam Mogilaiah) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు జారిపడి ఆయన కూతురు ముద్దుల రాములమ్మ (38) మృతి చెందింది

Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..
Mogilaiah Darshanam
Basha Shek
|

Updated on: May 05, 2022 | 5:07 PM

Share

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య (Darshanam Mogilaiah) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు జారిపడి ఆయన కూతురు ముద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్‌ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మ (Ramulamma)కు 20 ఏళ్ల క్రితం నాగర్ కర్నూలు మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకట స్వామి తో వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తూ పెళ్లైన నాలుగేళ్ల తర్వాతే అతను మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది. కాగా గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోతే రాములమ్మ ఆమె ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ బీటీ రోడ్డు పై జారి పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో లింగాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అచ్చంపేట హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. రాత్రి పది గంటల ప్రాంతంలో అచ్చంపేట ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గ్రామంలోనే రాములమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోన్ లో మొగిలయ్యను పరామర్శించారు. రాములమ్మ కూతురు వెన్నెల మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇక మొగిలయ్యకు మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా.. వారిలో ఇప్పటికే వివిధ కారణాలతో నలుగురు చనిపోయారు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మొగిలయ్య భార్య కూడా మరణించింది. కాగా కిన్నెర వాయిద్యంలో పేరొందిన మొగిలయ్య పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అందులో అతను ఆలపించిన టైటిల్‌సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంది. కిన్నెర వాయిద్యంతో కళామతల్లికి అతను చేస్తోన్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గుర్తించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఇవి కూడా చదవండి

Lemon water: ప్రతి రోజూ ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IPL 2022: సన్‌రైజర్స్ జట్టులోకి మరో లెఫ్టార్మ్‌ పేసర్‌.. ధోనితో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసా?

Viral Video: ఇతనికి ఫిట్‌నెస్‌ అంటే ఎంత ప్రేమో.. కింద పడిపోయినా ఆపట్లేదుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్