Supreme Court: ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా తీసుకోవాలా? ఆర్టికల్-21 ఏం చెబుతోంది?

Supreme Court: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. రాష్ట్రాలు కూడా ఎక్కువ మొత్తంలో వ్యాక్సినేషన్‌..

Supreme Court: ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా తీసుకోవాలా? ఆర్టికల్-21 ఏం చెబుతోంది?
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2022 | 5:46 PM

Supreme Court: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. రాష్ట్రాలు కూడా ఎక్కువ మొత్తంలో వ్యాక్సినేషన్‌ (Vaccination) జరిగేలా చర్యలు చేపడుతోంది. ఇక వ్యాక్సినేషన్‌ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరినీ బలవంతంగా వ్యాక్సిన్ వేయించుకోరాదని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా ఆర్టికల్ 21కి సంబంధించిన విషయాలను వివరించింది. వాస్తవానికి ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయలేదని కేంద్ర ప్రభుత్వం మార్చిలో సుప్రీంకోర్టుకు తెలిపింది. 100% వ్యాక్సినేషన్ అని మాత్రమే చెప్పినట్లు కేంద్రం తెలిపింది. 100% మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం మాకు సూచించిందని తమిళనాడు అదనపు అడ్వకేట్ జనరల్ అమిత్ ఆనంద్ తివారీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇలా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే అంశంపై సోమవారం విచారణ జరిగింది.

ఆర్టికల్ 21 అంటే ఏమిటి?

ఆర్టికల్ 21 ప్రకారం.. ఒక వ్యక్తి తన వ్యాక్సినేషన్‌ గురించి ఆయన అనుమతి లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలనే అంశాన్ని ఉల్లంఘించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవడం అనేది తప్పనిసరి కాదు. భారత రాజ్యాంగం ప్రకారం.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దేశంలోని ఏ వ్యక్తి జీవితాన్ని లేదా స్వేచ్ఛను హరించరాదని చెబుతోంది. భారతదేశంలోని చట్టం ముందు సమానత్వం లేదా చట్టాల సమాన రక్షణను ఏ వ్యక్తికి నిరాకరించకూడదు. ఇది వారి ప్రాథమిక హక్కు.

సుప్రీంకోర్టు ప్రకటన ప్రకారం.. ఆర్టికల్ 21 సాధారణ వ్యక్తి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించవచ్చు. అంటే అతను టీకాలు వేసేందుకు ఎలాంటి బలవంతం చేయరాదు. COVID-19 మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారుల ఆదేశించడం సరైంది కాదని కోర్టు పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోని వారి కంటే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని చూపించడానికి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.. కానీ అందుకోసం కొన్ని పరిమితులు ఉండాలి. కరోనా కేసుల సంఖ్య తగ్గే వరకు సంబంధిత ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో టీకాలు వేసుకోని వారిపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే అధికారులపై కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని సుప్రీం కోర్టు సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?

Akshaya Tritiya Sales 2022: అక్షయ తృతీయ రోజున బంగారు అభరణాలు కొంటున్నారా..? మీ కోసం అదిరిపోయే ఆఫర్లు!

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?