Covovax: సీరమ్ సంస్థ గుడ్‌న్యూస్.. ఈ వ్యాక్సిన్ ధర రూ.900 నుంచి రూ.225కు తగ్గింపు
Covovax: గత రెండేళ్లకుపైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ..
Covovax: గత రెండేళ్లకుపైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే గతంలో వ్యాక్సిన్ ధరలు ఎక్కువగా ఉండగా, తర్వాత రేట్లను తగ్గించింది కేంద్రం. ఇక కోవోవాక్స్ వ్యాక్సిన్ (Vaccine) టీకా ఒక్కోడోసు ధరను రూ. 900 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేటు సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చింది.
ఇక ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే డోసు ధరను రూ.225 ప్లస్ జీఎస్టీగా నిర్ధారించినట్లు కేంద్ర ప్రభుత్వానికి కంపెనీ తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు రూ.150 వరకు సర్వీస్‌చార్జిని వసూలు చేయవచ్చని తెలిపింది. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సిఫార్సును అనుసరించి ఈ వ్యాక్సిన్ ధరను సవరించి కొవిన్ పోర్టల్‌లో పొందుపర్చింది. ప్రస్తుతం 12 సంవత్సరాలుపైబడిన పిల్లలకు ఇండియాలో కోర్బెవాక్స్, కోవాగ్జిన్, కోవోవాక్స్ అందుబాటులో ఉన్నాయి.
అయితే 12 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోలాజికల్ E’s Corbevax టీకాలు వేస్తుండగా, 15-18 సంవత్సరాల వయసు గల వారికి భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటు సెంటర్లలో కోవాగ్జిన్ డోసు జీఎస్టీతో కలిపి రూ.386 ఉండగా, కార్బెవాక్స్ ధర రూ.900 ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: