Tata Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. మరో కంపెనీ కొనుగోలు.. రూ.12,100 కోట్లకు ఒప్పందం..!

Tata Group: ఎయిర్ ఇండియా తర్వాత నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ కంపెనీని టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ ప్రభుత్వ యాజమాన్యంలోని ..

Tata Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. మరో కంపెనీ కొనుగోలు.. రూ.12,100 కోట్లకు ఒప్పందం..!
Follow us
Subhash Goud

|

Updated on: May 04, 2022 | 10:29 AM

Tata Group: ఎయిర్ ఇండియా తర్వాత నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ కంపెనీని టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ ప్రభుత్వ యాజమాన్యంలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL)ని టేకోవర్ చేయనుంది. ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలును పూర్తి చేస్తుందని టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD) టి వి నరేంద్రన్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా 18,000 కోట్ల రూపాయల బిడ్ వేసి పేరును సంపాదించుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలు పూర్తవుతుందని, మా అధిక విలువ కలిగిన రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు దీన్ని వేగవంతం చేస్తామని నరేంద్రన్ చెప్పారు. ఒడిశాకు చెందిన ఉక్కు తయారీ సంస్థ ఎన్‌ఐఎన్‌ఎల్‌లో 93.71 శాతం వాటాను రూ.12,100 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ జనవరి 31న విన్నింగ్ బిడ్‌ను ప్రకటించింది.

కంపెనీకి రూ.6600 కోట్ల బకాయిలు ఉన్నాయి:

NINL 31 మార్చి 2021 నాటికి రూ.6,600 కోట్లు బకాయిపడింది. ఇందులో ప్రమోటర్ల రూ.4,116 కోట్ల బకాయిలు, బ్యాంకులకు రూ.1,741 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో రుణదాతలు, ఉద్యోగుల సొమ్ము కూడా ఉంటుంది. NINL ప్రతికూల నికర విలువ రూ. 3,487 కోట్లు, కంపెనీకి మార్చి 31, 2021 నాటికి రూ. 4,228 కోట్ల నష్టం ఉంది. భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఉక్కు కంపెనీని ప్రైవేటీకరించడం ఇదే తొలిసారి. NINL ఒడిశాలోని కళింగనగర్‌లో 11 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని కలిగి ఉంది. కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది. ఈ ప్లాంట్ 30 మార్చి 2020 నుండి మూసివేయబడింది. NINLకు చెందిన ఉద్యోగులందరూ వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న వారి కంపెనీలోనే కొనసాగుతారు. ఈ ఒప్పందం ప్రకారం.. కొనుగోలుదారు కంపెనీ ఉద్యోగుల కోసం 1 సంవత్సరం లాక్-ఇన్ వ్యవధిని నిర్వహించడానికి కట్టుబడి ఉంటుంది. ఈ సమయంలో కొత్త కంపెనీ ఉద్యోగులను తొలగించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Atal Pension Yojana: మీరు అటల్‌ పెన్షన్‌ అకౌంట్‌ తీయాలా..? బ్యాంకుకు వెళ్లకుండా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. తాజా రేట్ల వివరాలు