Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. తాజా రేట్ల వివరాలు

Petrol-Diesel Price: పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం వాహనదారులకు తీవ్రమైన భారంగా ..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 04, 2022 | 10:16 AM

Petrol-Diesel Price: పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం వాహనదారులకు తీవ్రమైన భారంగా మారింది. అయితే రాకెట్‌లా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. వాహనదారులకు గత కొద్ది రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరట కల్పిస్తున్నాయి. చమురు కంపెనీలు చివరిసారిగా ఏప్రిల్‌ 6వ తేదీన లీటర్‌కు 80 పైసల చొప్పున పెంచగా, ఇక తాజాగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (IOC)లు బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విడుదల చేశాయి. వరుసగా 29వ రోజు కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 96.67గా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 120.51 ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 104.77 ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.105.49 వద్ద ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85 ఉండగా, డీజిల్ ధర రూ.100.94గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ముడి చమురు 106 డాలర్ల స్థాయిలో ఉంది.

ఈ సమయంలో ద్రవ్యోల్బణంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆర్థిక నిపుణుల నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తల వరకు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు 100 డాలర్ల పరిధిలోనే ఉంటే ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఏప్రిల్ 6 నుంచి ధర నిలకడగా ఉంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మార్చి 22, ఏప్రిల్ 6 మధ్య పెట్రోల్ ధర రూ. 10 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో లీటరుకు రూ. 100 కంటే ఎక్కువ ధఱ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర నిలకడగా ఉంది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Cumin Price: సామాన్యులకు షాక్‌.. రికార్డ్‌ స్థాయికి చేరుకోనున్న జీలకర్ర ధర..!

IDFC FIRST Bank: ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు..!