Cumin Price: సామాన్యులకు షాక్‌.. రికార్డ్‌ స్థాయికి చేరుకోనున్న జీలకర్ర ధర..!

Cumin Price: ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో జీలకర్ర (Cumin) కూడా చేరబోతోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. జీలకర్ర ధర మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాబోయే కా..

Cumin Price: సామాన్యులకు షాక్‌.. రికార్డ్‌ స్థాయికి చేరుకోనున్న జీలకర్ర ధర..!
Follow us
Subhash Goud

|

Updated on: May 03, 2022 | 9:17 PM

Cumin Price: ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో జీలకర్ర (Cumin) కూడా చేరబోతోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. జీలకర్ర ధర మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాబోయే కాలంలో జీలకర్ర ధర రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఏడాది జీలకర్ర విత్తనం తక్కువగా ఉందని క్రిసిల్(Crisil) రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో వర్షం కారణంగా పంట కూడా దెబ్బతింది. అందుకే జీలకర్ర ధర 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుత పంట సీజన్‌లో జీలకర్ర ధరలలో 30 నుండి 35 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే రైతులు ఇతర పంటలు వేయడం వల్ల జీలకర్ర సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని, వర్షం కారణంగా సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

ధరలు 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు:

తక్కువ విస్తీర్ణం, అధిక వర్షపాతం కారణంగా పంట నష్టం కారణంగా 2021-2022 పంట సీజన్‌లో జీలకర్ర ధరలు 30-35 శాతం పెరిగి ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. దిగుబడి తక్కువగా ఉండడంతో జీలకర్ర ధర కిలో రూ.165-170 వరకు పలుకుతుందని నివేదికలో పేర్కొంది. 2021-22 పంట సీజన్‌లో (నవంబర్-మే), వివిధ కారణాల వల్ల జీలకర్ర ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. జీలకర్ర గింజల ధరలను ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. 2021-2022 రబీ సీజన్‌లో జీలకర్ర ధరలు 30-35 శాతం పెరిగి కిలో రూ. 165-170కి చేరవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఫలితంగా ఇది 21 శాతం తగ్గి 9.83 లక్షల హెక్టార్లకు చేరుకుంది. రెండు ప్రధాన జీలకర్ర ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో గుజరాత్‌లో సాగు విస్తీర్ణం 22 శాతం, రాజస్థాన్‌లో 20 శాతం తగ్గింది.

ఆ పంటలపై మొగ్గు చూపడం వల్లే తగ్గిన సాగు విస్తీర్ణం:

కాగా, ఆవాలు, మినుము పంటలకు రైతులు మొగ్గు చూపడం వల్లే సాగు విస్తీర్ణం తగ్గుతోందని నివేదిక పేర్కొంది. ఆవాలు, కందిపప్పు ధరలు పెరగడంతో రైతులు వాటి సాగువైపు ఆకర్షితులయ్యారు. జీలకర్ర సాగు చేస్తున్న చాలా మంది రైతులు తమ పొలాల్లో మంచి ధర వచ్చే పంటలు వేసినట్లు తెలుస్తోంది. జీలకర్ర సాగు విస్తీర్ణం తగ్గి ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stress: ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు.. దీని నుంచి బయట పడటం ఎలా..?

World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

Spices To Avoid In Summer: వేసవిలో ఈ 4 మసాలాలు తినడం ప్రమాదమే..! అవేంటో తెలుసుకోండి