Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy Drone Delivery: ఆ నగరంలో డ్రోన్ డెలివరీలు మెుదలు పెట్టిన స్విగ్గీ.. త్వరలోనే మరిన్ని నగరాలకు..

Swiggy Drone Delivery: ఆన్‌లైన్‌లో ఇంటికి కావాల్సిన సరుకులు ఆర్డర్ చేసేవారికి అదిరిపోయే వార్త. త్వరలో డెలివరీ ఏజెంట్లు(Delivery Agents) కాకుండా డ్రోన్లు సరుకులు తీసుకురానున్నాయి.

Swiggy Drone Delivery: ఆ నగరంలో డ్రోన్ డెలివరీలు మెుదలు పెట్టిన స్విగ్గీ.. త్వరలోనే మరిన్ని నగరాలకు..
Swiggy
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 03, 2022 | 9:40 PM

Swiggy Drone Delivery: ఆన్‌లైన్‌లో ఇంటికి కావాల్సిన సరుకులు ఆర్డర్ చేసేవారికి అదిరిపోయే వార్త. త్వరలో డెలివరీ ఏజెంట్లు(Delivery Agents) కాకుండా డ్రోన్లు సరుకులు తీసుకురానున్నాయి. ఈ రోజుల్లో అందరూ గ్రాసరీల కొనుగోలుకు యాప్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. తక్కువ సమయంలో, మంచి డిస్కౌంట్లకు ఎవరు నాణ్యమైన వస్తువులను అందిస్తుంటే వారికే ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు జెప్ టో(Zepto) అయితే పది నిమిషాల్లో డెలివరీ ఇస్తుండగా. ఈ పోటీని తట్టుకునేందుకు బెంగళూరుకు చెందిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ నయా ఆలోచనతో ముందుకు వచ్చింది. సరకుల డెలివరీకి ఏకంగా డ్రోన్లను వినియోగించనుంది.

ఈ వార్త వినగానే మీరు ఆశ్చర్యానికి గురికావచ్చు. కానీ..  స్విగ్గీ ఇలాంటి సర్వీస్ త్వరలోనే దేశంలో ప్రారంభించబోతోంది. ఇన్‌స్టామార్ట్ సేవల్లో భాగంగా డ్రోన్లను ఉపయోగించి గ్రాసరీస్ డెలివరీ (Groceries Delivery) చేయనుంది. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్‌తో కలిసి బెంగళూరులో స్కైఎయిర్ మొబిలిటీ సంస్థతో కలిసి దీల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా డ్రోన్ డెలివరీని పరిశీలిస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. త్వరలోనే ఈ రెండు నగరాల్లో డ్రోన్ల ద్వారా నిత్యావసరాలను డెలివరీ ప్రారంభించనుంది స్విగ్గీ. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో గరుడ ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ కేంద్రాలను మనేసర్, గురుగ్రామ్, చెన్నైలో వర్చువల్‌గ్రా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రోన్ల తయారీ విలువ 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశంలో డ్రోన్ సాంకేతిక సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థ 2024 నాటికి భారత్ లో లక్ష డ్రోన్‌లను తయారు చేయాలని సంకల్పించుకుంది.

మొదటగా డెలివరీల్లో ఎదురైన సవాళ్లను అధిగమించిన తర్వాత ANRA, TechEagle, Marut Dronetech కలిసి రెండో దశ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాయి. గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ మాట్లాడుతూ మే మొదటి వారంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. డార్క్ స్టోర్‌లో ఉన్న గ్రాసరీ ప్యాకేజెస్‌ని డ్రోన్లు డెలివరీ చేస్తాయి. డార్క్ స్టోర్లను సెల్లర్లు నిర్వహిస్తుంటారు. లేదా డ్రోన్ పోర్టుగా పిలిచే కామన్ మిడిల్ పాయింట్‌కు స్టోర్ నుంచి ప్యాకేజెస్ వస్తాయని ఆయన తెలిపారు. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్‌కు డెలివరీ చేస్తారని వివరించారు. కామన్ మిడిల్ పాయింట్‌ను స్విగ్గీ నిర్వహిస్తూ ఉంటుంది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన ఇన్‌స్టామార్ట్‌లో డ్రోన్ల వినియోగం ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలుసుకోవడమే ఈ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే డ్రోన్ల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగితే ఆ ఖర్చుల్ని స్విగ్గీ భరిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కొనడానికి కంపెనీకి అవసరమైన డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ ట్రయల్స్‌లో భాగంగా ANRA సంస్థతో కలిసి ఫుడ్, ఫార్మాసూటికల్స్ ఉన్న ప్యాకేజీలను 300 డ్రోన్ డెలివరీలను స్విగ్గీ పూర్తి చేసింది.

ఇవీ చదవండి..

Sunset: సూర్యుడు 24 గంటలూ ఉంటే ఎలా ఉంటది.. వామ్మో అనుకుంటున్నారా.. అక్కడ మాత్రం ఇది కామన్..

Adani Wilmar: దూసుకుపోతున్న అదానీ.. కోహినూర్ కంపెనీని సొంతం చేసుకున్న అదానీ విల్మర్..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..