AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar: దూసుకుపోతున్న అదానీ.. కోహినూర్ కంపెనీని సొంతం చేసుకున్న అదానీ విల్మర్..

Adani Wilmar: వంట సరకుల విక్రయాల్లో అగ్రగామి సంస్థగా ఉన్న అదానీ విల్మర్‌(Adani Wilmar) వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. FMCG విభాగాల్లోకి విస్తరించే క్రమంలో కొత్త కంపెనీలను కొంటూ ముందుకు సాగుతోంది.

Adani Wilmar: దూసుకుపోతున్న అదానీ.. కోహినూర్ కంపెనీని సొంతం చేసుకున్న అదానీ విల్మర్..
Chairman Gautam Adani
Ayyappa Mamidi
|

Updated on: May 03, 2022 | 7:11 PM

Share

Adani Wilmar: వంట సరకుల విక్రయాల్లో అగ్రగామి సంస్థగా ఉన్న అదానీ విల్మర్‌(Adani Wilmar) వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. FMCG విభాగాల్లోకి విస్తరించే క్రమంలో కొత్త కంపెనీలను కొంటూ ముందుకు సాగుతోంది. తాజాగా.. మెక్‌కార్మిక్‌ స్విట్జర్లాండ్‌కు చెందిన కోహినూర్‌ (Kohinoor) బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఈ కంపెనీ బాస్మతీ బియ్యం అమ్మకాల వ్యాపారంలో ఉంది. ఆహారపదార్థాల వ్యాపారంలో పట్టును పెంచుకునేందుకు ఈ చర్య కంపెనీకి దోహద పడనుందని తెలుస్తోంది. ఈ డీల్ విలువ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ కొనుగోలు ద్వారా కోహినూర్ పేరిట విక్రయిస్తున్న బాస్మతీ బియ్యం, ‘రెడీ టు కుక్‌’, ‘రెడీ టు ఈట్‌’ కూరలు, మీల్స్‌ పోర్ట్‌ఫోలియోపై అదానీ విల్మర్‌కు విక్రయ హక్కులు దక్కనున్నాయి. కోహినూర్‌ ద్వారా ఎఫ్‌ఎంసీజీలో ప్రీమియం వినియోగదారులను  ఆకట్టుకునేందుకు అవకాశం లభిస్తుందని అదానీ విల్మర్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కోహినూర్‌ బ్రాండ్‌ కింద కోహినూర్‌-ప్రీమియం బాస్మతీ రైస్‌, చార్మినార్‌-అఫర్డబుల్‌ రైస్‌, హొరేకా-హోటల్‌, రెస్టారెంట్‌, కేఫ్‌ సెగ్మెంట్లు ఉన్నాయి.

అదానీ విల్మర్‌ లాభాల క్షీణత..

మార్చితో ముగిసిన క్వార్టర్ ఫలితాలను కంపెనీ సోమవారం విడుదల చేసింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్లాఫిట్ 26 శాతం తగ్గి.. రూ.234.29 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో కంపెనీ లాభం రూ.315 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.15,022.94 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇది రూ.10,698.51 కోట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.803.73 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ.54,385.89 కోట్లుగా నమోదైంది.

దూసుకుపోతున్న అదానీ విల్మర్ షేర్..

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. సింగ్‌పూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌ కంపెనీల జాయింట్‌ వెంచరే ఈ అదానీ విల్మర్‌. ఈ గ్రూప్‌ ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ పేరుతో వంట నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులను దేశంలో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు అదానీ విల్మర్ కంపెనీలో సమావ వాటా కలిగి ఉన్నాయి. ఇటీవలే ఐపీవోలో 12 శాతం వాటాల విక్రయం తర్వాత ఇద్దరు ప్రమోటర్లకు 88 శాతం వాటాలు ఉన్నాయి. అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు ఇటీవల భారీగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అదానీ విల్మర్‌ షేరు ఫిబ్రవరి 8న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.230తో పోలిస్తే షేర్లు ఇప్పటి వరకు 231.98 శాతం మేర పెరిగాయి. ఐపీఓలో షేర్లు దక్కించుకుని ఇప్పటి వరకు హోల్డ్‌ చేసిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.526.60 లాభం వచ్చింది.

ఇవీ చదవండి..

Power Shortage: కంరెట్ కోతలకు అణు విద్యుత్ ప్రత్యామ్నాయమా.. తయారీలో మనం ఎందుకు వెనకబడ్డాం..

Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..