Atal Pension Yojana: మీరు అటల్‌ పెన్షన్‌ అకౌంట్‌ తీయాలా..? బ్యాంకుకు వెళ్లకుండా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Atal Pension Yojana: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో ఇంట్లోనే ఉండి వివిధ రకాల బ్యాంకు సర్వీసులను పొందే వెసులుబాటు వచ్చింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ..

Atal Pension Yojana: మీరు అటల్‌ పెన్షన్‌ అకౌంట్‌ తీయాలా..? బ్యాంకుకు వెళ్లకుండా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Atal Pension Yojana
Follow us
Subhash Goud

|

Updated on: May 04, 2022 | 8:45 AM

Atal Pension Yojana: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో ఇంట్లోనే ఉండి వివిధ రకాల బ్యాంకు సర్వీసులను పొందే వెసులుబాటు వచ్చింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ (Online)లో పనులు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా (Bank Account) తీయడం నుంచి పెన్షన్‌ పొందే వరకు అన్నింటిని కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక బ్యాంకుకు వెళ్లకుండా ఆధార్‌ నంబర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా అటల్‌ పెన్షన్‌ యోజన (APY) ఖాతాను తెరవవచ్చు. ఆధార్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అటన్‌ పెన్షన్‌ యోజన ఖాతాను తెరవవచ్చు. ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన అకౌంట్‌ తెరుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) తెలిపింది. అయితే ఈ సదుపాయాన్ని పొందేందుకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంకుకు వెళ్లకుండా డిజిటల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను ఈ-ఏపీవై ఆఫర్‌ చేస్తోందని పీఎఫ్‌ఆర్‌డీఏ తన సర్క్యూలర్‌లో తెలిపింది. అసంఘటిత రంగంలో పని చేసే వారు వయసు మీద పడిన వారు తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ పెన్షన్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పెన్షన్‌ స్కీమ్‌ ఖాతా బ్యాంకులు, పోస్టాఫీసులలో తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఫిజికల్‌గా, నెట్‌బ్యాంకింగ్‌, ఇతర డిజిటల్‌ విధానాల ద్వారా ఈ స్కీమ్‌ కింద ఎన్‌రోల్‌ కావాల్సి ఉండేది. కానీ ఈ ఖాతాలు మరింతగా పెంచేందుకు దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

అటల్‌ పెన్షన్‌యోజన కింద ఎన్‌రోల్‌ అయిన వారి సంఖ్య 2021-22 నాటికి 4 కోట్లను దాటినట్టు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తెలిపింది.2021-22 ఆర్థిక సంవత్సరంలో 99 లక్షలకు పైగా అకౌంట్లు తెరువగా, మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ మొత్తం సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 4.01 కోట్లకు చేరుకున్నాయి.

ఈ-ఏపీవై ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?

ఏపీవై సబ్‌స్క్రయిబర్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌కి  వెళ్లాలి. బ్యాంకును ఎంపిక చేసుకుని, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఈమెయిల్ ఐడీ, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ ఎక్స్‌ఎంఎల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ కోసం ఒక కోడ్ వస్తుంది. దాన్ని యాడ్ చేసి, క్యాప్చాను నమోదు చేసి, కంటిన్యూను నొక్కాలి. ఇలా అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత అటల్ పెన్షన్ స్కీమ్ లో నమోదు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IDFC FIRST Bank: ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు..!

Bank of Baroda: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్‌న్యూస్‌..!