LIC-IPO: అప్పుడు భారతీయులకు ఇన్సూరెన్స్ ఇవ్వని సంస్థ.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ.. LIC ప్రస్థానం ఇదే!

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే LIC IPO స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతోంది. దీని బిడ్డింగ్ తేదీని మే 4 .. మే 9 మధ్య ఉంచారు. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు, ఏజెంట్లు, ఉద్యోగుల టెన్షన్ పెరిగింది.

LIC-IPO: అప్పుడు భారతీయులకు ఇన్సూరెన్స్ ఇవ్వని సంస్థ.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ.. LIC ప్రస్థానం ఇదే!
Lic Story
Follow us
KVD Varma

|

Updated on: May 04, 2022 | 9:35 AM

LIC-IPO: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే LIC IPO స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతోంది. దీని బిడ్డింగ్ తేదీని మే 4 .. మే 9 మధ్య ఉంచారు. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు, ఏజెంట్లు, ఉద్యోగుల టెన్షన్ పెరిగింది. 5 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. ఈ రోజు LIC పూర్తి కథనాన్ని దాని పుట్టుక నుంచి బ్రాండ్‌గా మారిన విధానం వరకూ తెలుసుకుందాం. ఈ కంపెనీ ప్రభుత్వానికి ఎంత డబ్బు ఇచ్చింది? భారతదేశంలో ఇన్సూరెన్స్ అంటే LIC అనెంతగా ఎలా మారింది? గత 65 ఏళ్లలో ఎల్‌ఐసీ ప్రతి గ్రామానికి ఎలా చేరింది? ఈ విషయాలన్నిటినీ వివరంగా చెప్పుకుందాం.

మొదట్లో కంపెనీ భారతీయులకు బీమా చేయలేదు..

మీకు తెలుసా.. మన దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభించిన సమయంలో మన భారతీయులకు ఇన్సూరెన్స్ చేసేవారు కాదు. మొదటిసారిగా 1818లో భారతదేశ గడ్డపై బీమా కంపెనీ ప్రారంభించారు. దాని పేరు ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది బ్రిటిష్ వారి జీవితానికి మాత్రమే బీమా చేసింది. బాబు ముత్తిలాల్ సీల్ లాంటి కొందరి కృషితో భారతీయులకు కూడా ఇన్సూరెన్స్ రావడం మొదలైంది. అయితే వారికి ప్రీమియం రేట్లు వేరుగా ఉండేవి. 1870లో తొలి భారతీయ జీవిత బీమా కంపెనీని ప్రారంభించినప్పుడు భారతీయులకు సమాన హక్కులు లభించాయి. క్రమంగా భారతదేశంలో జీవిత బీమా కంపెనీల వరద వచ్చింది.

245 కంపెనీలను విలీనం చేయడం ద్వారా ..

LIC 1956లో 245 కంపెనీలను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. 1956 వరకు 154 భారతీయ బీమా కంపెనీలు, 16 విదేశీ కంపెనీలు .. 75 ప్రావిడెంట్ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. 1 సెప్టెంబర్ 1956న, ప్రభుత్వం ఈ 245 కంపెనీలన్నింటినీ జాతీయం చేసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే LICను ప్రారంభించింది. అప్పట్లో ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలను దీనికోసం విడుదల చేసింది. 1956లో LICకి 5 జోనల్ కార్యాలయాలు, 33 డివిజనల్ కార్యాలయాలు, 212 బ్రాంచ్ కార్యాలయాలు .. ఒక కార్పొరేట్ కార్యాలయం ఉండేవి. ఈ కంపెనీ ఏడాదిలోనే 200 కోట్ల బిజినెస్ చేసింది. ప్రజల్లో దీనిపై నమ్మకం ఏర్పడటానికి ప్రధాన కారణం దీనికి ప్రభుత్వ హామీ ఉండటమే.

1990ల సరళీకరణల సమయంలో కూడా ఆధిపత్యం..

1990ల వరకు భారతదేశంలోని చాలా కంపెనీలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్నాయి. 1991 తర్వాత క్రమంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ కు అమ్మేసినా ప్రభుత్వం మాత్రం ఎల్‌ఐసీ జోలికి పోలేదు. అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు ఉన్నప్పటికీ, LIC భారతదేశంలోని బీమా మార్కెట్‌లో మూడింట రెండు వంతుల మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది దాదాపు 36 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన తమ డబ్బు ఎప్పటికీ మునిగిపోదనే నమ్మకాన్ని ఎల్‌ఐసీ ప్రజల్లో కల్పించింది.

జీవిత బీమా అంటే ఎల్‌ఐసి అనేంతగా మార్చడంలో ప్రకటనల పాత్ర..

1970లలో LIC మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ఆ కాలం నాటి ప్రకటనలో రెండు చేతుల మధ్య బాలుడి చిత్రం ఉండేది. అతను మీ రక్షణ వెచ్చదనాన్ని అనుభవించనివ్వండి అని అనే క్యాప్షన్ తో ఆ ప్రకటన ఉండేది. దృశ్యశ్రవణ మాధ్యమం 1980లలో వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్‌ఐసీ అనే సందేశాన్ని కంపెనీ ఇచ్చింది. ఈ విషయం ప్రజల మనస్సులో దూరిపోయింది.

ఆ రోజుల్లో, దూరదర్శన్‌లో ఒక ప్రకటన ట్యాగ్‌లైన్- రోటీ, బట్ట, ఇల్లు .. జీవిత బీమా. (రోటీ.. కాపాడా.. మకాన్ ఔర్ LIC). 1990ల చివరలో, LIC తన బ్రాండ్ ఇమేజ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ‘నా చింతా, నా ఫికర్’ .. ‘జిందగీ కే భీ, జిందగీ కే బాద్ భీ’ వంటి ట్యాగ్‌లైన్‌లతో ముమ్మరమైన ప్రచారం చేశారు.

LIC 20వ శతాబ్దంలో ఒక ప్రకటన సంచలనం సృష్టించింది. ఒక అమ్మాయి బజారులో తప్పి పోతుంది. తండ్రి ఆమె కోసం వెతుకుతున్నాడు. అకస్మాత్తుగా ఆమె పక్కనే ఉన్న ఒక దుకాణంలో ఆ తండ్రికి కనిపిస్తుంది. ఈ యాడ్ క్యాప్షన్ ఇలా చెబుతుంది.. ”జీవితంతో కూడా, జీవితం తర్వాత కూడా. 70ల నాటి హస్తం ఇప్పుడు వెచ్చని కౌగిలిలా మారింది”.

ఇలా LIC ఒక బ్రాండ్ లా మారడానికి.. మన దేశంలో ఇన్సూరెన్స్ అంటే LIC అనేలా ప్రజల మనస్సులలో ప్రత్యేక స్థానం ఏర్పడటానికి ప్రచార ప్రకటనలు ఎంతో సహాయం చేశాయి.

ప్రభుత్వానికి ఎల్‌ఐసీ వడ్డీ వ్యాపారుల ఖజానా..

ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఎల్‌ఐసీని వడ్డీ వ్యాపారుల ఖజానాలా వాడుకుంటూ వస్తుంది. 2015లో ఓఎన్‌జీసీ ఐపీఓ సమయంలో ఎల్‌ఐసీ దాదాపు 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. 2019లో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన IDBI బ్యాంక్‌ని రక్షించే విషయానికి వస్తే, LIC మరోసారి తన బ్యాగ్‌ని తెరిచింది.

LIC నుంచి 23 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు తీసుకున్నాయి..

2019 లో విడుదల చేసిన RBI డేటా ప్రకారం, LIC మొదటి నుంచి ప్రభుత్వ రంగంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఇందులో 2014-15 నుంచి 2018-19 మధ్య మాత్రమే రూ.10.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు.

ప్రస్తుతం ఇది 100% ప్రభుత్వ సంస్థ అయితే ఇప్పుడు మే 4న ప్రభుత్వం 3.4% LIC షేర్లను విక్రయించబోతోంది. ఈ విధంగా, LIC IPO దాదాపు 21 వేల కోట్ల రూపాయలుగా ఉంది. రానున్న కాలంలో ఎల్‌ఐసీ కంపెనీకి చెందిన 10% వాటాలను స్టాక్‌మార్కెట్‌లో విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

LIC ఉద్యోగుల ఆందోళన ఎందుకు?

LIC ఉద్యోగులు ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. IPO తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు తమ ఉద్యోగాల గురించి భయపడుతున్నారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాలో ఏదైనా అవకతవకలు జరిగినా ఈ కంపెనీపై బీమా హోల్డర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తుందని ఉద్యోగులు అంటున్నారు.

IPO కారణంగా, LIC పాలసీదారుల హార్ట్ బీట్ కూడా పెరిగింది. అయితే, వారిపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావడం వల్ల కంపెనీ పనితీరులో మరింత పారదర్శకత వస్తుంది. ఎల్‌ఐసి ఐపిఒ ఇష్యూ పరిమాణం నుంచి 10% షేర్లను పాలసీ హోల్డర్‌లకు రిజర్వ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ వర్గాలలో సంచలనం సృష్టిస్తున్న.. అందరి దృష్టిలో ఒక అద్భుతంలా అనిపిస్తున్న LIC IPO నేపధ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పూర్తి కథ. ప్రభుత్వంలో అతి పెద్ద సంస్థ ఇప్పుడు కొంత భాగం ప్రయివేట్ పరమ కాబోతోంది. ఇక పై LIC తీరు ఎలా ఉండబోతోందో.. LIC IPO ఎంత సంచలనం సృష్టించబోతోందో వేచి చూడాల్సిందే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..

Tata Motors: ఏప్రిల్ లో సూపర్ సేల్స్ నమోదు చేసిన టాటా మోటార్స్.. ప్రత్యర్థి కంపెనీలు డీలా..