LIC IPO: LIC IPOలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారా? SBI తన YONO యాప్ ద్వారా సూపర్ ఆఫర్ ఇచ్చింది.. అదేమిటంటే..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO ఈరోజు అంటే మే 4న ప్రారంభమైంది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. 9 మే 2022 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.
LIC IPO: ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO ఈరోజు అంటే మే 4న ప్రారంభమైంది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. 9 మే 2022 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. LIC IPO లో రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.45 తగ్గింపు తర్వాత కనీసం రూ.13,560 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి 14 లాట్లు, అంటే 210 షేర్లు. పెట్టుబడిదారులు గరిష్టంగా రూ.1,89,840 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా, పాలసీదారులు రూ.60 తగ్గింపు తర్వాత కనిష్టంగా రూ.13,335 అలాగే గరిష్టంగా రూ.1,86,690 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, పాలసీదారులతో పాటు ఉద్యోగులకు కూడా అదనపు ప్రయోజనం ఉంటుంది.
పాలసీదారుల కేటగిరీ కింద ఎల్‌ఐసి పాలసీదారులకు ప్రభుత్వం 10% రిజర్వ్ చేసింది. అయితే, LIC IPO పాలసీదారులకు దరఖాస్తు చేయడానికి వారి LIC పాలసీలతో వారి PANని లింక్ చేయాలి. IPOకి సబ్‌స్క్రయిబ్ చేయడానికి చెల్లుబాటు అయ్యే డీమ్యాట్ ఖాతాను కూడా కలిగి ఉండాలి. ఇక LIC IPO లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద అవకాశం కల్పించింది. SBI YONO యాప్ ద్వారా ఇన్వెస్టర్స్ LIC IPOకు అప్లై చేసుకునే వేసులుబాటు కల్పించింది. ఈ మేరకు గతనెల 30 వతేదీన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో తెలిపిన దాని ప్రకారం.. LIC IPOకు అప్లై చేసుకోవాలని అనుకునే వారు నేరుగా SBI YONO నుంచి ఆ పని చేయవచ్చు. “మీ పెట్టుబడి ప్రయాణాన్ని ఈరోజే ప్రారంభించండి!” అని SBI ట్వీట్ చేసింది. అంతేకాకుండా “ఖాతా ప్రారంభ ఛార్జీలు లేకుండా ఇప్పుడు YONOలో మీ డీమ్యాట్ అలాగే ట్రేడింగ్ ఎకౌంట్ ను తెరవండి. అదేవిధంగా DP AMC మొదటి సంవత్సరం పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడే YONOని డౌన్‌లోడ్ చేసుకోండి!” అంటూ వివరించింది. దీని ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ డీమ్యాట్ ఎకౌంట్ ను ఖర్చు లేకుండా తెరిచే అవకాశం కల్పించింది SBI.
SBI Tweet ఇదే:
Start your investment journey today!
Open your demat and trading account on YONO now with no account opening charges & DP AMC completely waived off for first year. Download YONO now!#SBISecurities #Investments #IPO #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI @_sbisecurities pic.twitter.com/0dGe9pB51Q
— State Bank of India (@TheOfficialSBI) April 30, 2022
డీమ్యాట్ & ట్రేడింగ్ ఖాతా కోసం మీరు SBI యోనో యాప్‌లో ఎలా నమోదు చేసుకోవాలంటే..
దశ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI యోనో యాప్‌ని తెరవండి దశ 2: ఆధారాలను ఉపయోగించి YONO SBI యాప్‌లో లాగిన్ చేయండి దశ 3: ప్రధాన మెను క్రింద, పెట్టుబడి విభాగం దశకు వెళ్లండి దశ 4: ఓపెన్ డీమ్యాట్ & ట్రేడింగ్ ఖాతాపై క్లిక్ చేయండి దశ 5: అవసరమైన మొత్తం సమాచారాన్ని అక్కడ నమోదు చేయండి దశ 6: ‘నిర్ధారించు’పై క్లిక్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..
Tata Motors: ఏప్రిల్ లో సూపర్ సేల్స్ నమోదు చేసిన టాటా మోటార్స్.. ప్రత్యర్థి కంపెనీలు డీలా..