కోహ్లీసేన సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.?
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరగా.. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) కొద్దిసేపు చక్కటి ఆటతీరు కనబరిచాడు. ఇది ఇలా ఉండగా భారత్ అభిమానులను ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే… గతంలో ఈ స్టేడియంలో […]
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరగా.. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) కొద్దిసేపు చక్కటి ఆటతీరు కనబరిచాడు. ఇది ఇలా ఉండగా భారత్ అభిమానులను ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే…
గతంలో ఈ స్టేడియంలో 5 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింట్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో టాస్ న్యూజిలాండ్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తుందా.. అనే చర్చ మొదలైంది. అయితే భారత్ అభిమానులు మాత్రం ఈ సెంటిమెంట్‌ను టీమిండియా బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.