బుమ్రా టాప్ క్లాస్ ప్లేయర్- ఐసీసీ సీఈవో
లండన్: భారత్ యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ ప్రదర్శనకి చాలా మంది ఫిదా అవుతున్నారు. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్ ప్రశంసించారు. ఇప్పటికే టోర్నీలో 18 వికెట్లు పడగొట్టిన ఈ యువ బౌలర్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా బుమ్రా తన సత్తా చాటుతున్నాడు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ ఎంత ట్రై చేసినా కూడా..ఇబ్బంది […]
లండన్: భారత్ యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ ప్రదర్శనకి చాలా మంది ఫిదా అవుతున్నారు. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్ ప్రశంసించారు. ఇప్పటికే టోర్నీలో 18 వికెట్లు పడగొట్టిన ఈ యువ బౌలర్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా బుమ్రా తన సత్తా చాటుతున్నాడు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ ఎంత ట్రై చేసినా కూడా..ఇబ్బంది పెట్టే యార్కర్స్‌తో ప్రత్యర్థి టీంకు గుదిబండలా మారాడు. ఈ సందర్భంగా రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. ‘లీగ్ దశలో కీలక మ్యాచ్‌ల్లో భారత విజయాల్లో బుమ్రాది కీలక పాత్ర. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతనో టాప్-క్లాస్ ఆటగాడు.’ అని తెలిపారు. మరోవైపు టోర్నీలో భారత్ మంచి ఫామ్ ఉందని.. బ్యాటింగ్‌పరంగానూ బలంగా కనిపిస్తోందని రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చారు.