Crime News: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..

Telangana Crime News: ఓ కుటుంబంపై పాము పగబట్టింది. ఒకర్ని, ఇద్దర్ని కాదు.. ఒకే ఇంట్లో ఏకంగా ముగ్గుర్ని కాటేసింది. పాము కాటుకు చిన్నారి మృతి చెందగా.. దంపతులు

Crime News: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..
Snake Bite
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2021 | 1:11 PM

Telangana Crime News: ఓ కుటుంబంపై పాము పగబట్టింది. ఒకర్ని, ఇద్దర్ని కాదు.. ఒకే ఇంట్లో ఏకంగా ముగ్గుర్ని కాటేసింది. పాము కాటుకు చిన్నారి మృతి చెందగా.. దంపతులు ఇద్దరు చావుబతుకుల మధ్య ఉన్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ముందు మూడు నెలల చిన్నారిని కాటేసిన పాము.. తండ్రి, తల్లిని కూడా కాటేసింది. ఈ ఘటనలో పసిపాప మరణించగా.. తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శనిగరపురానికి చెందిన క్రాంతి- మమత భార్యభర్తలు. వారికి మూడు నెలల పాప ఉంది. శనివారం రాత్రి పాపతో కలిసి దంపతులు నిద్రపోయారు. పాము ఎక్కడ్నుంచి.. ఎలా వచ్చిందో తెలియదు.. కానీ మంచంలోకి దూరింది. ఆ సమయంలో పసికందును పాము కాటేయడంతో ఏడవటం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఏమైందో అని లేచి.. చూస్తున్నారు. ఈ క్రమంలో పాప దుస్తుల్లోకి దూరిన పాము.. భార్యాభర్తలిద్దరినీ కూడా కాటేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

వెంటనే ముగ్గురిని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తరలిస్తున్న క్రమంలోనే చిన్నారి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మూడు నెలల చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఇంట్లో పాము ముగ్గురిని కాటేయడం, చిన్నారి మరణించడంతో శనిగపురం గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read:

Crime News: గర్భిణిని వదిలిపెట్టి.. దీపావళి సంబరాల్లో మునిగారు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి

మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..

Human Tail: అప్పుడే పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. 12 సెం.మీ తోకతో బాలుడి జననం.. ఎక్కడంటే..?

AP Crime News: ప్రకాశం జిల్లాలో విషాదం.. చెరువులో స్నానానికి దిగి.. మగ్గురు అయ్యప్ప భక్తుల మృతి..