Crime News: హైదరాబాద్‌లో దారుణం.. నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. నెల రోజులుగా యువతిపై సామూహిక అత్యాచారం!
హైదరాబాద్ గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు
Hyderabad Woman Gang Raped:హైదరాబాద్ గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నగ్న చిత్రాలతో బెదిరింపులకు దిగుతూ.. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళ కాళ్లు చేతులు బంధించి తనపై అత్యాచారం చేశారని, అపై తన నగ్న, అశ్లీల చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ మహిళ తెలిపింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరికైనా జరిగిన విషయం చెప్తే చంపుతానని బెదిరించడంతో ఎవరికి చెప్పలేక పోయానని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలెనగర్ కంచెకు చెందిన ఓ మహిళ (28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమెను కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే ఎకాత్తాతూ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అయితే ఏకాత్తతూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి అమె ఇంట్లోకి చొరబడి కాళ్లు, చేతులు బందించి గన్ తో బెదిరించి షాహిన్ నగర్ కు తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపై తన అశ్లీల వీడియోలు తీసి బెదిరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. ఫొటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు.
కాగా, ఈ ఘటనపై గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. ఎవరికైనా విషయం చెబితే ప్రాణాలు తీస్తామని అని బెదిరించడంతో నెల రోజుల నుండి ఎవరికీ చెప్పుకో లేదని తెలిపింది. బాధితురాలు సంఘటన జరిగిన నాటి నుంచి మనోవేదనకు గురై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Read Also… Andhra Pradesh: పోలీసులకు కొత్త పవర్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇకపై ఆ బాధ్యతలు వారికే.. !