Army Jawan: ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన జవాన్.. గమ్యం చేరుకుండానే విగత జీవిగా.. |
సెలవులపై ఇంటికి వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్ళిన ఆర్మీ జవాన్, తన రెజిమెంట్‌కు చేరకుండానే అదృశ్యమయ్యాడు. ఇటు స్వగ్రామంలో భార్య, తల్లిదండ్రులకు సమాచారం లేదు. అటు తాను పనిచేస్తున్న ఆర్మీ రెజిమెంట్‌కు వెళ్ళలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన ఆర్మీ అధికారులకు విగతజీవిగా మారి కనిపించాడు.

సెలవులపై ఇంటికి వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్ళిన ఆర్మీ జవాన్, తన రెజిమెంట్‌కు చేరకుండానే అదృశ్యమయ్యాడు. ఇటు స్వగ్రామంలో భార్య, తల్లిదండ్రులకు సమాచారం లేదు. అటు తాను పనిచేస్తున్న ఆర్మీ రెజిమెంట్‌కు వెళ్ళలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన ఆర్మీ అధికారులకు విగతజీవిగా మారి కనిపించాడు.
పోలీసుల దర్యాప్తులో జవాన్ పశ్చిమ బెంగాల్‌లోని ఎల్‌జిపిటి రైల్వే స్టేషన్‌లో దిగిపోయినట్టు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్ళాడన్న వివరాలు లభించలేదు. ఈ క్రమంలో ఎల్‌జిపిటి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఓ మృతదేహాన్ని నెలరోజుల తరువాత గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహం అదృశ్యమైన ఆర్మీ జవాన్‌దిగా గుర్తించారు.
ప్రకాశంజిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి మారంరెడ్డి వీర బ్రహ్మానందరెడ్డి సెలవుల్లో గడిపేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఏడాది క్రితం పెళ్ళి కావడంతో భార్య, తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి విధుల్లో చేరేందుకు జనవరి 8వ తేదీన రైల్లో బయలుదేరాడు. గమ్యం చేరకుండానే రెండు రోజుల తరువాత జనవరి 10వ తేదిన పశ్చిమ బెంగాల్‌లోని ఎల్‌జిపిటి రైల్వే స్టేషన్‌లో దిగాడు. ఆ తరువాత ఇటు కుటుంబ సభ్యులకు కానీ, అటు ఆర్మీ అధికారులకు కానీ వీరబ్రహ్మాందరెడ్డి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు.
ఆర్మీ ఉద్యోగి వీరబ్రహ్మానందరెడ్డి అదృశ్యం మిస్టరీగా మారింది. వీర బ్రహ్మానంద రెడ్డి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని న్యూజల్‌పైగురిలో విధులు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామానికి వచ్చి తిరిగి రైల్లో వెళుతుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఎల్‌జిపిటి రైల్వే స్టేషన్ లో దిగి అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన అదృశ్యమైన వీర బ్రహ్మానంద రెడ్డి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆర్మీ అదికారులకు సమాచారం అందించారు. డిసెంబర్ 8వ తేదీన సెలవులపై ఇంటికి వచ్చి జనవరి 8వ తేదీన తిరిగి విధులలో చేరేందుకు వెళ్లిన వీర బ్రహ్మానందరెడ్డి, జనవరి 10వ తేదీన ఆఖరిసారి మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్‌జిపిటి రైల్వే స్టేషన్‌లో జవాను వీరబ్రహ్మానందరెడ్డి రైలు దిగినట్టు గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే నెలరోజుల వరకు అతని ఆచూకీ లభించకపోగా వీర బ్రహ్మానంద రెడ్డికి సంబంధించిన మొబైల్ ఫోన్, లగేజీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరబ్రహ్మానందరెడ్డి కోసం గాలిస్తున్న రైల్వే పోలీసులకు నెలరోజుల తరవాత అదే రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం వీరబ్రహ్మానందరెడ్డిదిగా గుర్తించిన రైల్వే పోలీసులు ప్రకాశం జిల్లాలోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో జవాన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ ఎలా చనిపోయాడో ఆరా తీయాలని ఆర్మీ అధికారులను వేడుకుంటున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




