Watch Video: యువకుడిపై ట్రాఫిక్ పోలీసుల దాష్టీకం.. దండంపెట్టి వేడుకున్న వదలని ఖాకీలు.. ! ట్విస్ట్ ఏంటంటే..
వీడియోలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ కింద బైఠాయించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో యువకుడిని అడ్డుకున్న పోలీసులు అతన్ని దారుణంగా కొట్టారు. వైరల్ వీడియోలో యువకుడు చేతులు జోడించి వేడుకున్నాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందిస్తూ..పోలీసుల తీరును ఖండించారు.
ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారే పోలీసులను ధిక్కరిస్తున్నారు. అటువంటి సందర్భాలలో వివాదాలు తలెత్తుతాయి. ఫలితాలు తప్పుగా ఉంటాయి. ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసులు మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఓ యువకుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వీడియో వైరల్‌గా మారింది. ఓ యువకుడిని ట్రాఫిక్ పోలీస్ కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
అర్ధరాత్రి యువకుడిని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ నగర్‌లో చోటుచేసుకుంది. వీడియోలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ కింద బైఠాయించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో యువకుడిని అడ్డుకున్న పోలీసులు అతన్ని దారుణంగా కొట్టారు. వైరల్ వీడియోలో యువకుడు చేతులు జోడించి వేడుకున్నాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందిస్తూ..పోలీసుల తీరును ఖండించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ट्राॅफिक वाल्याची दादागिरी बघा. This is inhuman and has no right to touch civilians. He shall be terminated With Immediate Effect @MTPHereToHelp @CPMumbaiPolice @Dev_Fadnavis @India_NHRC @mid_day @DGPMaharashtra @MahaDGIPR Strict and immediate action is expected. Jai Hind 🇮🇳 pic.twitter.com/GRs30vHOR3
— Darshan Soni (@DarshanSoniCRPC) February 8, 2024
వైరల్ వీడియోలోపై ముంబై ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌ట్రాక్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్ రీపోస్ట్ చేసింది. “ప్రియమైన ముంబైవాసులారా, వైరల్ అవుతున్న వీడియో ముంబై నగరానికి చెందిన కాదు..ఏదో ఒక పాత వీడియో ఇది.. ఎక్కడ జరిగిందో కూడా తెలియదు..’ దయచేసి గమనించండి. సంబంధిత పోలీసు విభాగం ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంది అని ముంబై పోలీసులు వివరణ వెల్లడించారు.
పట్టపగలు ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ యువకులను తన్నడం, చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపించింది. వైరల్ వీడియోలో తనపై హింసను ఆపాలని యువకుడు చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ వీడియో శుక్రవారం (ఫిబ్రవరి 9) సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ వీడియో ‘X’ (గతంలో ట్విట్టర్)లో వేల సంఖ్యలో వీక్షణలను పొందింది. ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా నెటిజన్లు దీనిపై స్పందిస్తూ పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ట్రాఫిక్ పోలీసులను ఎలా వేధిస్తున్నారో వారి అనుభవాలను కూడా పంచుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..