AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్‌లో బ్రష్ చేయడం నేరం.. జరిమానా కట్టాల్సిందే..! ఈ రైల్వే నియమం తెలుసుకోకపోతే నష్టమే..!

చిప్స్ లేదా ఇతర వస్తువులు తిన్న తర్వాత, చాలా మంది ప్రయాణికులు స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో రేపర్లను విసిరివేస్తుంటారు. ఇది కూడా నేరమే. నిర్ణీత ప్రదేశంలో తప్ప ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడవేయకూడదు. ఖాళీగా ఉన్న రైల్వే ప్రాంగణంలో కాకుండా..కేటాయించిన కంటైనర్‌లో మాత్రమే చెత్తను వేయండి. 

రైల్వే స్టేషన్‌లో బ్రష్ చేయడం నేరం.. జరిమానా కట్టాల్సిందే..! ఈ రైల్వే నియమం తెలుసుకోకపోతే నష్టమే..!
Brushing Teeth At Station
Jyothi Gadda
|

Updated on: Feb 13, 2024 | 4:24 PM

Share

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణ కాలంలో రైలు మాత్రమే సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సాధనం. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే అనేక నియమాలను ఏర్పాటు చేసింది. కానీ, ప్రయాణికులకు వాటి గురించి చాలా తక్కువ తెలుసు. రోజూ రైలులో ప్రయాణించేవారికి కూడా రైల్వేలోని ప్రతి నియమం తెలియదు. అందులో ఒకటి రైల్వే స్టేషన్‌లో పళ్లు తోముకోవడం. అవును రైల్వే స్టేషన్‌లో బ్రష్‌ చేయడం నేరమని మీకు తెలుసా.? ఇలా చేస్తే సంబంధిత నిబంధనల మేరకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్లో పల్లు తోముకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. ఆ రూల్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

రైలులో ఎక్కువ దూరం ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఉదయం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్లాట్‌ఫారమ్‌లోని కుళాయిల వద్ద పళ్ళు తోముకోవడం, రాత్రి భోజనం చేసిన పాత్రలను కూడా కడగడం మనం చూస్తుంటా. ఆ తరువాత, కాఫీ, టీ లు, బ్రేక్‌ఫాస్ట్‌ కూడా అక్కడే చేస్తుంటారు. కానీ మీకు తెలుసా, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కుళాయి, వాష్‌ ఏరియాలో తప్ప ఎక్కడ పడితే అక్కడ పళ్లు తోముకోవటం నేరం. ఇలాంటి పనులు చేసే వారికి రైల్వే జరిమానా కూడా విధించవచ్చు.. మీకు ముఖ్యమైన రైల్వే నియమాలను తెలుసుకుందాం.

రైల్వే స్టేషన్‌లో పళ్లు తోముకుంటే జరిమానా..!

ఇవి కూడా చదవండి

రైల్వే చట్టం 1989 ప్రకారం.. రైల్వే ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశాలు కాకుండా మరేక్కడైనా బ్రష్ చేయడం, ఉమ్మివేయడం, టాయిలెట్ చేయడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం వంటివి చేయటం నేరం కిందకు వస్తాయి. మరుగుదొడ్లు, నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే ఈ పనులు చేయాలి. ఈ నిషేధిత చర్యలకు పాల్పడివారిని రైల్వే సిబ్బంది పట్టుకుంటే, ఆ ప్రయాణీకుడికి రూ. 500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ నియమాన్ని కూడా తెలుసుకోండి..

మీరు రైల్వే లేదా రైల్వే ప్రాంగణంలో ఎక్కడైనా ఏదైనా వ్రాసినా లేదా ఏదైనా పోస్టర్ వేసినా అది కూడా రైల్వే చట్టం ప్రకారం నేరం కిందకు వస్తుంది. దీనిపై జరిమానా విధించవచ్చు.

చిప్స్ లేదా ఇతర వస్తువులు తిన్న తర్వాత, చాలా మంది ప్రయాణికులు స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో రేపర్లను విసిరివేస్తుంటారు. ఇది కూడా నేరమే. నిర్ణీత ప్రదేశంలో తప్ప ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడవేయకూడదు. ఖాళీగా ఉన్న రైల్వే ప్రాంగణంలో కాకుండా..కేటాయించిన కంటైనర్‌లో మాత్రమే చెత్తను వేయండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..