AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Knowledge: శరీరానికి అవసరమైన పాలలో లేని విటమిన్ ఏదో తెలుసా..? మరిన్ని ఆసక్తికరమైన సందేహాలు..

ఉదాహరణకు.. ప్రతి ఇంట్లోనూ పాలు వాడుతుంటారు. పాలను సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. కానీ పాలలో లేని విటమిన్ ఏంటో తెలుసా? బహుశా మీకు దీని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

General Knowledge: శరీరానికి అవసరమైన పాలలో లేని విటమిన్ ఏదో తెలుసా..? మరిన్ని ఆసక్తికరమైన సందేహాలు..
General Knowledge
Jyothi Gadda
|

Updated on: Feb 13, 2024 | 3:51 PM

Share

మన నిత్య జీవితానికి చాలా దగ్గర ఉండే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ వాటి సమాధానాలు మనకు తెలియవు. అలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నమవుతుంటాయి. అయితే, అలాంటి ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఇలాంటి జనరల్‌ నాలెడ్జ్ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయనే భావనో మీకు అందించటం జరుగుతుంది. ఉదాహరణకు.. ప్రతి ఇంట్లోనూ పాలు వాడుతుంటారు. పాలను సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. కానీ పాలలో లేని విటమిన్ ఏంటో తెలుసా? బహుశా మీకు దీని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. ప్రశ్న: గుమ్మడికాయ, అవకాడో ఈ రెండు పండ్ల..? లేదంటే కూరగాయలా..? జవాబు : గుమ్మడికాయ మరియు అవకాడో పండ్లు, కూరగాయలు కాదు.

2. ప్రశ్న : అంతరిక్షంలో పండించిన మొదటి కూరగాయ ఏది? జవాబు: నాసా, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ అంతరిక్షంలో కూరగాయలను పండించడంలో విజయం సాధించారు – అంతరిక్షంలో మొదట బంగాళాదుంపలు పండించారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 1995లో జరిగింది.

ఇవి కూడా చదవండి

3. ప్రశ్న: ప్రపంచంలో అత్యంత దుర్వాసన వచ్చే పండు అని దేనిని అంటారు? జవాబు: డురియన్ పండు అత్యంత దుర్వాసన గల పండుగా చెబుతారు. డురియో మలేషియా, ఇండోనేషియా మరియు థాయిలాండ్‌లో పండుతుంది. ఇది కుళ్లిన గుడ్లు, సాక్స్, చెత్త వంటి దుర్వాసన వెదజల్లుతుంది.

4. ప్రశ్న: బ్రోకలీని ఉడికించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? జవాబు: బ్రోకలీని ఉడికించడానికి ఉత్తమ మార్గం దానిని ఆవిరి చేయడం.

5. ప్రశ్న: ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు ఉన్న దేశం ఏది? జవాబు: స్వీడన్‌లో 220,000 ద్వీపాలు ఉన్నాయి!

6.ప్రశ్న : పావురాలకు ఆహారం పెట్టడం ఏ దేశంలో చట్టవిరుద్ధం? జవాబు: దక్షిణ ఆస్ట్రేలియాలో పావురాలకు ఆహారం ఇవ్వడం నేరం. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ఇది ఇటలీలోని వెనిస్‌లో కూడా నిషేధించబడింది.

7. ప్రశ్న: ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన ఎక్కడ ఉంది? జవాబు: దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ చైనాలో ఉంది. ఇది హై స్పీడ్ రైలు కోసం నిర్మించబడింది. ఈ వంతెన 2010 సంవత్సరంలో పూర్తయింది.

8. ప్రశ్న: పాలలో లభించని విటమిన్ ఏది? జవాబు: ఐరన్, విటమిన్ సి పాలలో సరైన పరిమాణంలో కనిపించవు. ఎక్కువ కాల్షియం పాలతో లభిస్తుంది.

9. ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పురాతనమైన వంతెన ఏది? జవాబు: ప్రపంచంలోని పురాతన వంతెన కజర్మా వంతెన లేదా అర్కాడికో వంతెన. ఈ వంతెన గ్రీస్‌లోని పెలోపొన్నీస్‌లోని అర్గోలిడాలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 1300 ప్రాంతంలో నిర్మించబడిందని చెబుతారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..