Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..

Hyderabad : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఆభరణాలు మాయమవుతున్నాయి. రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు

Hyderabad  : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..
Tims
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 09, 2021 | 11:49 PM

Hyderabad : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఆభరణాలు మాయమవుతున్నాయి. రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు విలపిస్తుంటే మరోవైపు ఇదే అదనుగా సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పేషెంట్ల నగలు మాయమవుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ పేషెంట్ల కోసం ఈ సెంటర్‌‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కానీ ఈ ఆస్పత్రిలో జరుగుతున్న కథ వేరేలా ఉంది.

సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో పేషెంట్లు నిలువుదోపిడీకి గురవుతున్నారు. రోగం సంగతి దేవుడెరుగు.. విలువైన వస్తువులు పోగొట్టుకొని గుండెలు బాదుకుంటున్నారు. వరుస దొంగతనాలతో టిమ్స్‌ ప్రతిష్ఠ మసకబారుతోంది. చికిత్స కోసం గంపెడాశతో వచ్చే రోగులకు దొంగతనాల రూపంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కుతున్నారు. ఈ దొంగతనాలపై దృష్టిసారించిన పోలీసులు టిమ్స్‌లో పనిచేసే ఇద్దరిని పట్టుకొని విచారించారు.

కూపీ లాగితే అసలు విషయం కాస్త బయటపడింది. చింతపల్లి రాజు, లతశ్రీ అనే దంపతులు పేషెంట్ల నుంచి బంగారు, వెండి నగల్ని చోరీ చేస్తున్నట్టుగా తేలింది. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును ముత్తూట్‌, అట్టిక ఫైనాన్స్‌లలో కుదవ పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. వీరిపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిందితులపై పీడీయాక్ట్‌ ను నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని తెలిపారు.

IND vs SL: శ్రీలంకతో జరిగే వన్డే, టీ 20 సిరీస్ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన

Corona Third Wave: మూడో దశ ముప్పుకు రెడీగా ఉండండి.. ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై ప్రధాని మోడీ హై లెవల్‌ మీటింగ్‌

PM Kisan Scheme: దరఖాస్తుదారులందరికీ పిఎం కిసాన్ పథకం డబ్బు ఎందుకు రాలేదు? కారణం ఇదే..!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంటగలిసిన మానవత్వం… ఏ తల్లికీ రాకూడని కష్టం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!