Jadcherla Mandal: బంక్‌లో రాత్రికి రాత్రే 4 వేల లీటర్ల డీజిల్ దోచేశారు.. ఏకంగా మోటార్లతో తోడేశారు

పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేంజ్‌లో మండిపోతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇంట్లో నుంచి బండి భయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.

Jadcherla Mandal:  బంక్‌లో రాత్రికి రాత్రే 4 వేల లీటర్ల డీజిల్ దోచేశారు.. ఏకంగా మోటార్లతో తోడేశారు
Diesel Theft
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2021 | 9:29 PM

పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేంజ్‌లో మండిపోతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇంట్లో నుంచి బండి భయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ దొంగల గురించి ఇటీవల మాట్లాడుకోవాల్సి వస్తుంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న బంక్ నుంచి ఏకంగా 4వేల లీటర్ల డీజిల్ దోచేశారు దొంగలు. శారదా ఫిల్లింగ్ స్టేషన్ లో డీజిల్ ట్యాంకుల సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి భారత్ ఆయిల్ కంపెనీ వాళ్లు 4వేల లీటర్ల డీజిల్ ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇది గమనించిన దొంగలు రాత్రికి రాత్రే మోటర్లతో డీజిల్ కాజేశారు. విషయం తెలుసుకున్న ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.  ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రకాశం జిల్లాలో  ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని దుండగులు కిరాతకంగా చంపేశారు. అనంతరం చిన్నారి డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి ముళ్లపొదల్లో పడేశారు. గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన ఖాసీంవలి, రబియాబీల చిన్న కూతురు ఖాసింబీ 2వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన పేరెంట్స్..పాప కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్థుల సాయంతో చుట్టుపక్కల వెతకగా.. గ్రామ సరిహద్దుల్లోని ముళ్లపొదల్లో ఖాసింబీ విగతజీవిగా పడి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read: బాబు పుట్టిన వేళ కానుక ఇవ్వలేదని కిడ్నాప్ చేసి మరీ మూడు నెలల పనిగుడ్డుని చంపేసిన హిజ్రా

 గల్లీ క్రికెటర్‌గా మారిన తెలంగాణ స్పీకర్.. సిక్సులతో దుమ్మురేపిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే