ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో..

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 4:26 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,34,62,873 నమోదు కాగా అలాగే కరోనాతో మొత్తం 5,81,317 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 50,29,095 యాక్టీవ్ కేసులు ఉండగా, 78,52,461 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 35,45,077 నమోదవ్వగా, మొత్తం 1,39,143 మంది కరోనాతో మరణించారు. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, ఇట‌లీ, ఫ్రాన్స్, మెక్సికో, లండ‌న్ వంటి ప‌లు దేశాల్లో కూడా క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి. 582 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 9,36,181కి చేరుకుంది. ప్రస్తుతం 3,19,840 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 5,92,032 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 24,309.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..