కరోనా ఆంక్షలు.. 12 నిముషాల్లోనే వివాహ వేడుక..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ క్రమంలో ఆ జంట‌ వివాహంతో ఒక్క‌ట‌య్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 12:23 pm, Wed, 15 July 20
కరోనా ఆంక్షలు.. 12 నిముషాల్లోనే వివాహ వేడుక..!

Indian groom married to Nepali bride: కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆ జంట‌ వివాహంతో ఒక్క‌ట‌య్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి. పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు త‌న తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జ‌రిగే త‌మ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు. వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది.

కరోనా ఆంక్షల నేపథ్యంలో.. నేపాల్ పరిపాలనా విభాగం అనుమ‌తితో భార‌త్‌లోని పిథోరాగఢ్‌కు చెందిన కమలేష్ చంద్ త‌న వివాహం కోసం నేపాల్‌లోని దర్చులాకు చేరుకున్నాడు. పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్ర‌భుత్వ అనుమ‌తి మేర‌కు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. ద‌ర్చులాలో వ‌రుడు, వ‌ధువు దండ‌లు మార్చుకున్నారు. వెంట‌నే ఆ కొత్త దంప‌తులు భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. కాగా మార్చి 22న వీరి వివాహం జ‌ర‌గాల్సివుంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డింది.