తిరుపతి పరిధిలో లాక్‌డౌన్..! ఇవి తప్పనిసరి నిబంధనలు

చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీంత దారుణంగా ఉంది. కేవలం ఒక్క తిరుపతి నగరంలోనే వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. దీంతో..

  • Jyothi Gadda
  • Publish Date - 12:48 pm, Wed, 15 July 20
తిరుపతి పరిధిలో లాక్‌డౌన్..! ఇవి తప్పనిసరి నిబంధనలు

చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీంత దారుణంగా ఉంది. కేవలం ఒక్క తిరుపతి నగరంలోనే వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు, యాత్రికులు కూడా వైరస్ పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా కేసులు ఉన్న 18 డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌ను అమలు చేయనున్నారు. 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29,30,31,35, 36, 37, 38 డివిజన్లలో లాక్‌డౌన్‌ విధించనున్నారు.

ఆయా డివిజన్ల పరిధిలో ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. అత్యవసరమైన, మెడికల్ ఎమర్జెన్సీ, మద్యం షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇక, తిరుపతి నగరంలోని మిగిలిన డివిజన్లలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతిని ఇచ్చారు.