జీహెచ్ఎంసీ : బ‌స్తీ పేద‌ల‌కు ఫంక్ష‌న్ హాళ్ల‌లో క‌రోనా వైద్యం..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 15, 2020 | 12:26 PM

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. అధికారులు యుద్దప్రాతిప‌దిక‌న నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ప్ప‌టికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు.

జీహెచ్ఎంసీ : బ‌స్తీ పేద‌ల‌కు ఫంక్ష‌న్ హాళ్ల‌లో క‌రోనా వైద్యం..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. అధికారులు యుద్దప్రాతిప‌దిక‌న నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ప్ప‌టికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. దీంతో మ‌రింత అలెర్టయ్యింది జీహెచ్ఎంసీ యంత్రాంగం. ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చ‌నున్నారు. 1500 బ‌స్తీల‌లో ప్ర‌త్యామ్మాయ ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఈ బ‌స్తీల్లో దాదాపు 20 ల‌క్ష‌ల మంది నివ‌శిస్తున్న‌ట్టు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ల‌క్ష‌ణాలు లేని, స్ప‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ఇంట్లోనే చికిత్స పొందేలా హోమ్ ఐసోలేష‌న్ కిట్లు అంద‌జేస్తున్నారు. అయితే ఇంట్లో వైద్యానికి సౌక‌ర్యం లేని వారి కోసం ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చుతున్నారు.

బస్తి పేదల్లో ఎవ‌రికైనా కరోనా సోకితే ఫంక్షన్ హాళ్లలో ఉంచి చికిత్స అందిచ‌నున్నారు. ప్రతి రోజు వేలల్లో వస్తున్న కేసులతో అధికారుల అప్రమత్త‌మై ఈ చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇప్పటికే గ్రేట‌ర్ లో సర్కిళ్ల వారిగా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu