AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త టీవీ తెచ్చిన తంటా..ఫ్యామిలీ మొత్తానికి కరోనా

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాలను సైతం వైరస్‌ వెంటాడుతోంది. అధికార యంత్రాంగం, ప్రజలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఓ రూపేనా వైరస్‌ స్వైర విహారం చేస్తూనే ఉంది. సిక్కోలు జిల్లాలో

కొత్త టీవీ తెచ్చిన తంటా..ఫ్యామిలీ మొత్తానికి కరోనా
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2020 | 11:55 AM

Share

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాలను సైతం వైరస్‌ వెంటాడుతోంది. అధికార యంత్రాంగం, ప్రజలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఓ రూపేనా వైరస్‌ స్వైర విహారం చేస్తూనే ఉంది. సిక్కోలు జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. టెక్కలో ఊహించని రీతిలో ఓ కుటుంబం మొత్తం కరోనా బారినపడింది.

జిల్లాలోని టెక్కలి కొడ్రవీధికి చెందిన ఓ దంపతులు టెక్కలి మెయిన్ రోడ్డులో గల ఓ ఎలక్ట్రానిక్ షాపులో టీవీ కొన్నారు. ఆ టీవీయే వారిని కరోనాకు పట్టించినట్లయింది. పాపం కొత్త టీవీ కొన్న ఆనందం రోజులు కూడా గడవ లేదు. అంతలోనే ఎలక్ట్రానిక్ షాపు యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే షాపును మూసివేసి.. అక్కడికి వచ్చిన కస్టమర్ల వివరాలపై ఆరా తీశారు అధికారులు. షాపులో వస్తువుల్ని కొనుగోలు చేసిన కస్టమర్లను అప్రమత్తం చేశారు. అందరినీ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ఇదిలా, ఉండగానే టీవీ కొనుగోలు చేసిన దంపతులు అనారోగ్యానికి గురయ్యారు. ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలడంతో ఖంగుతిన్నారు. టీవీ కొన్నదంపతులతో పాటు వారి కుమార్తె , అల్లుడికి కూడా కరోనా సోకింది. అయితే, వీరి కుమార్తె టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండటంతో..విషయం తెలిసిన ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ల్యాబ్‌లో పనిచేస్తున్న తోటి సిబ్బంది కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే వారందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పాపం.. కొత్త టీవీ కొన్న ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడ్డారు. అయితే, ఇంతమందికి వైరస్‌ సంక్రమించటానికి కారణమైన ఎలక్ట్రానిక్‌ షాపు యజమానికి కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు ఆరా తీయగా..అతడికి పలాసలోనూ మరో బ్రాంచి ఉన్నట్లుగా తెలిసింది. రోజూ అతడు పలాస, టెక్కలి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Follow Us
కెరీర్ పీక్‌లో ఉండగానే ప్రమాదం.. ఎనిమిది నెలలపాటు మంచానికే ..
కెరీర్ పీక్‌లో ఉండగానే ప్రమాదం.. ఎనిమిది నెలలపాటు మంచానికే ..
మహిళ డెడ్‌బాడీ కేసులో వీడిన మిస్టరీ..
మహిళ డెడ్‌బాడీ కేసులో వీడిన మిస్టరీ..
మార్కెట్లో అరటి పువ్వు కనిపిస్తే వదలకండి!ఆరోగ్య లాభాలు తెలిస్తే..
మార్కెట్లో అరటి పువ్వు కనిపిస్తే వదలకండి!ఆరోగ్య లాభాలు తెలిస్తే..
బూటుకాలితో తన్నులు తిన్న కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో..
బూటుకాలితో తన్నులు తిన్న కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో..
రెండు రూమ్‌ల రేకుల ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
రెండు రూమ్‌ల రేకుల ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం శుభమా? అశుభమా?
గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం శుభమా? అశుభమా?
అమరీందర్ సింగ్ బీజేపీని వీడతారా? కాంగ్రెస్‌లో చేరికపై ఏమన్నారంటే.
అమరీందర్ సింగ్ బీజేపీని వీడతారా? కాంగ్రెస్‌లో చేరికపై ఏమన్నారంటే.
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు
రూటు మార్చిన కేటుగాళ్లు.. విషయం తెలిసి పోలీసులే షాక్!
రూటు మార్చిన కేటుగాళ్లు.. విషయం తెలిసి పోలీసులే షాక్!
అదృష్టం అంటే వీరిదే.. వీరు బంగారం ధరిస్తే కోరుకున్నది జరుగుద్దీ
అదృష్టం అంటే వీరిదే.. వీరు బంగారం ధరిస్తే కోరుకున్నది జరుగుద్దీ