హైదరాబాద్‌లో కరోనా టెర్రర్.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..
యూసుఫ్ గూడ, చార్మినార్, రాజేంద్ర నగర్, కార్వాన్, మెహిదీ పట్నం, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 500లకు పైగా కరోనా కేసులు ఉండటంతో వాటిని హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ హైరిస్క్ ఏరియాలకు నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఇక కోవిడ్ విజృంభణ నేపథ్యంలో..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకూ వేలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ సామాన్యులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నటులు, వైద్యులు, పోలీసుల కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది తెలంగాణ సర్కార్.
యూసుఫ్ గూడ, చార్మినార్, రాజేంద్ర నగర్, కార్వాన్, మెహిదీ పట్నం, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 500లకు పైగా కరోనా కేసులు ఉండటంతో వాటిని హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ హైరిస్క్ ఏరియాలకు నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఇక కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న వారికి వైద్య సేవలు అందేలా ప్లాన్‌గా ముందుకు వెళ్తున్నారు.
ఇక ఆయా ఏరియాల్లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు అధికారులు. ఒక వీధిలో నాలుగైదు భవనాల్లో పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆ గల్లీలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట సమయం వరకే షాపులు, ఇతర బిజినెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నారు.
హైరిస్క్ ఏరియాలకు నోడల్ ఆఫీసర్ల వివరాలు:
– యూసుఫ్ గూడ్ – కే యాదగిరి (అదనపు కమిషనర్) – మెహిదీపట్నం – జే శంకరయ్య (అదనపు కమిషనర్) – చాంద్రాయణ గుట్ట – ఏ విజయలక్ష్మి (అదనపు కమిషనర్) – కుత్బుల్లాపూర్ – ప్రియాంక ఆల (జోనల్ కమిషనర్) – రాజేంద్ర నగర్ – బదావత్ సంతోష్ (అదనపు కమిషనర్) – అంబర్ పేట – జయరాత్ కెనడి (అదనపు కమిషనర్) – చార్మినార్ పీఎస్ రాహుల్ రాజ్ (అదనపు కమిషనర్) – కార్వాన్ – బి సంధ్య (జాయింట్ కమిషనర్)
Read More:
తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..