AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!

ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమవుతుంది. హీమోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్‌ను మన శరీరంలో ప్రతి భాగానికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!
Low Iron Symptoms
Prashanthi V
|

Updated on: Apr 07, 2025 | 9:30 PM

Share

ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్‌తో పాటు మసిల్ సెల్స్‌లో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్లను కూడా నిర్మించేందుకు సహాయపడుతుంది. ఇవి మన శరీరంలో శక్తిని ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఐరన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి చర్మాన్ని, జుట్టును, గోళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఐరన్ లోపం ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. దీని ప్రభావం చేతులు, కాళ్ల మీద కనిపిస్తుంది. సాధారణంగా వేడి ఉండే ప్రాంతాల్లోనూ వారు చల్లగా అనిపించుకోవచ్చు. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరుగుతుంది.

ఐరన్ తక్కువగా ఉన్నవారికి చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుంది. శరీరంలో తక్కువ ఐరన్ వల్ల ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల శక్తి స్థాయి తగ్గిపోతుంది. ఈ కారణంగా వారు శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించుకుంటారు.

ఐరన్ లోపం ఉన్నవారికి చిన్న దూరం నడిచినా, సగం మెట్లు ఎక్కినా ఊపిరి పెరగడం, గాఢంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది శరీరంలోని కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే పరిణామం.

తరచూ తలనొప్పి రావడం కూడా ఐరన్ తక్కువగా ఉన్నట్లు సూచించే ఒక సంకేతం. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఫలితంగా మైగ్రేన్ లాంటి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఐరన్ లోపం ఉన్నవారి గోళ్లు బలహీనంగా, పొడి‌గా మారతాయి. కొంచెం ఒత్తిడి వచ్చినా విరగడం లేదా ముడతలు పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది శరీరంలో పోషకాల లోపాన్ని సూచించే కీలక లక్షణంగా పరిగణించబడుతుంది.

ఐరన్ లోపాన్ని మొదటి దశలోనే గుర్తించి పోషకాహారంతో ఎదుర్కోవడం చాలా అవసరం. ఆహారంలో పాలకూర, బీట్రూట్, గోంగూర, ఎండు ద్రాక్ష వంటి ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలి. శరీరానికి అవసరమైన ఐరన్ తగినంతగా అందితే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కానీ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?