‘కరోనా వైరస్ స్వీట్, కేకుల’ తయారీ.. ఎక్కడంటే?

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ప్రభావానికి వణికిపోతోంది. రోజురోజుకీ మరింత విజృంభిస్తూనే ఉంది. మందే లేని ఈ వ్యాధిని ఎలా కట్టడి చేయాలా అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నో దేశాలు ఈ వైరస్ ప్రభావానికి లాక్‌డౌన్‌లోకి..

'కరోనా వైరస్ స్వీట్, కేకుల' తయారీ.. ఎక్కడంటే?
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 10:34 PM

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ప్రభావానికి వణికిపోతోంది. రోజురోజుకీ మరింత విజృంభిస్తూనే ఉంది. మందే లేని ఈ వ్యాధిని ఎలా కట్టడి చేయాలా అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నో దేశాలు ఈ వైరస్ ప్రభావానికి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ వైరస్‌పై అవగాహన కల్పించడానికి పోలీసులు.. వైరస్ ఆకారంలో ఉన్న హెల్మెట్లను ధరించి.. ప్రజలకు అవగాహన కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ స్వీట్ షాప్ యజమాని కరోనా వైరస్ ఆకారంలో ఉన్న స్వీట్స్‌, కేక్‌లను రూపొందించాడు. దీంతో ఆ దుకాణంలోకి వచ్చే కస్టమర్లు ఈ స్వీట్‌లను చూసి అవాక్కవుతున్నారు. లాక్‌డౌన్‌లోనూ బెంగాల్ ప్రభుత్వం మిఠాయి షాపులకు మినాయింపు ఇచ్చింది. మిఠాయి దుకాణాలను ప్రతీరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని, కానీ సిబ్బంది సంఖ్య మాత్రం పరిమితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..