Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతానని..
One hundred more positive cases expected says CM KCR, ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతానని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గత మూడు, నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పదుల సంఖ్యలో నమోదవడంతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 364 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. దీంతో ప్రజలు మరింత జాగ్రత్త తీసుకోవాలన్నారు.

అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్‌ అందరూ ఎంతో గొప్పగా పని చేస్తున్నారన్నారు కేసీఆర్‌. మొదటి రెండు మూడు రోజులైతే నిద్రాహారాలు మానేసి పని చేశారని ప్రశంసించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి వీరంతా తీవ్రంగా శ్రమించారని చెప్పారు. నిజాముద్దీన్‌ ఘటనతో కలిపి 364 మందికి పాజిటివ్‌ వచ్చిందని… ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 11 మంది చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని… ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి పాజిటివ్ వచ్చిందని… వారి కుటుంబ సభ్యుల్లో 92 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం తెలిపారు కేసీఆర్‌. అలాగే ఎవరికైనా కరోనా ఉన్నట్టు అనుమానాలుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..

Related Tags