సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

సొంతూరికి వెళ్లడానికి ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ పథకం వేశారు. వారిలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకుని.. గ్రామానికి వెళ్లేందుకు ఆంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నారు. దారిలో ఉన్న అన్ని చెక్‌పోస్టుల వద్ద..

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2020 | 8:52 PM

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ విధించింది మంచికైనా.. ఈ ఎఫెక్ట్‌తో ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. తినడానికి లేక ఇంటి అద్దెలు కట్టలేక సొంత ఊళ్లకి పయనమవుతున్నారు. కొంతమంది కాళ్లు అరిగేలా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో పలువురు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇక మరికొందరైతే తమ మెదడుకు పలు రకాలుగా పని పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా సొంతూరికి వెళ్లడానికి ఓ వ్యక్తి శవం గెటప్ వేసి దొరికి పోయాడు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సొంతూరికి వెళ్లడానికి ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ పథకం వేశారు. వారిలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకుని.. గ్రామానికి వెళ్లేందుకు ఆంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నారు. దారిలో ఉన్న అన్ని చెక్‌పోస్టుల వద్ద.. తమ స్నేహితుడు చనిపోయాడని, శవాన్ని గ్రామానికి తీసుకెళ్తున్నామని పోలీసులకు అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఇలా సూరన్ కోట్ చెక్‌పోస్టుకు చేరుకోగానే అక్కడి పోలీసులకూ ఇదే కహానీ చెప్పారు. కానీ అనుమానమొచ్చిన పోలీసులు.. ఆంబులెన్స్‌‌లో తనిఖీ చేశారు. అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్‌ చూడగా బతికే ఉన్నాడని పసిగట్టారు. దీంతో ఆ ముగ్గురి వ్యక్తులతో పాటు డ్రైవర్‌ని, అతని సహాయకుడిని.. పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారిపై సెక్షన్ 420, 269, 180 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..