షాకింగ్..ఒక్కరోజే 704 కేసులు నమోదు..!
కరోనా మహమ్మారి దేశంలో విజృంబిస్తోంది. గత నెల చివర్లో కేవలం వెయ్యి వరకే ఉన్న పాజిటివ్ కేసులు.. ఒక్క వారంలోనే అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.ప్రస్తుతం దేశంలో 4వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. సోమవారం రోజున మొత్తం 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారుల చెబుతున్నారు. తాజాగా నమోదైన […]

కరోనా మహమ్మారి దేశంలో విజృంబిస్తోంది. గత నెల చివర్లో కేవలం వెయ్యి వరకే ఉన్న పాజిటివ్ కేసులు.. ఒక్క వారంలోనే అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.ప్రస్తుతం దేశంలో 4వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. సోమవారం రోజున మొత్తం 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారుల చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసులతో.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,281కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా లెక్కట ప్రకారం.. దేశంలోని మొత్తం కేసుల్లో 3,851 యాక్టివ్‌గా ఉండగా..318 మంది డిశ్చార్జ్ అయ్యారని.. 111 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 748 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 571 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలొ నమోదైన 4281 కేసుల్లో 1445 కేసులు తబ్లిఘీ జమాత్‌తో లింకులున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.



