AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతమయ్యది ఎప్పుడు.? ఇదే ఇప్పుడు మానవజాతి ముందున్న ఏకైక ప్రశ్న. దీనికి ‘సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్‌యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. ఒక్క భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి కరోనా రక్కసి పీడ ఎప్పుడు వదులుతుందన్న అంశంపై వీరు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం జూలై 25న భారత్ కరోనా ఫ్రీ కంట్రీగా.. అలాగే డిసెంబర్ 8 […]

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!
Ravi Kiran
|

Updated on: Apr 29, 2020 | 2:49 PM

Share

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతమయ్యది ఎప్పుడు.? ఇదే ఇప్పుడు మానవజాతి ముందున్న ఏకైక ప్రశ్న. దీనికి ‘సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్‌యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. ఒక్క భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి కరోనా రక్కసి పీడ ఎప్పుడు వదులుతుందన్న అంశంపై వీరు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం జూలై 25న భారత్ కరోనా ఫ్రీ కంట్రీగా.. అలాగే డిసెంబర్ 8 నాటికి ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి దక్కుతుందని వారు చెబుతున్నారు.

రోజూవారి కేసుల నమోదు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్య, వైరస్ వ్యాప్తి రేటు, లాక్ డౌన్ ఆంక్షలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాల్లో వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై వారు అంచనాలను రూపొందించారు. వర్సిటీ నివేదిక ప్రకారం మే 21 నాటికి 97 శాతం, అలాగే మే 31కి 99 శాతం భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని.. ఇక జూలై 25 నాటికి భారత్ కరోనాను పూర్తిగా నిర్మూలిస్తుందని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని అటుంచితే.. మే నెలాఖరు దాకా కేంద్రం లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై కూడా సింగపూర్ వర్సిటీ తన నివేదికను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఆగష్టు 26న విముక్తి పొందుతుందని.. డిసెంబర్ 8 నాటికి ప్రపంచం నుంచి కరోనా కనుమరుగైపోనుందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి 97 శాతం కేసులు, అలాగే జూన్ 16 నాటికి 99 శాతం కేసులు తగ్గుతాయని పేర్కొంది.

Read Also: 

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..