గుజరాత్‌పై కరోనా పంజా.. అత్యధిక కేసులతో రెండో స్థానం
దేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులతో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 9,289 మందికి వైరస్ సోకింది. ఇక గుజరాత్

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టినా.. పాజిటివ్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులతో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 9,289 మందికి వైరస్ సోకింది. ఇక గుజరాత్ 3,774 కేసులతో రెండో స్థానంలో ఉంది.
గుజరాత్‌లోనూ కోవిడ్ భూతం జడలు విప్పుకుంటోంది. అంతకంతకూ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,774కు చేరింది. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 434 మంది కోలుకోగా.. 181 మంది మరణించారు. ప్రస్తుతం గుజరాత్‌లో 3159 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర తర్వాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల్లో ర్యాంకుల వారిగా రాష్ట్రాలు పరిశీలించినట్లైతే… మహారాష్ట్ర 9,218, గుజరాత్ 3,774, మధ్యప్రదేశ్ 2,387, రాజస్థాన్ 2,364, తమిళనాడు 2058, ఉత్తరప్రదేశ్ 2,053, ఆంధ్రప్రదేశ్ 1332, తెలంగాణ 1,009, పశ్చిమ్ బెంగాల్ 697 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ గడువు మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా..? లేదంటే మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తారా..? అన్నది వేచిచూడాల్సి ఉంది.