ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసోలేషన్, క్వారంటైన్ అనే పదాలను మనం తరుచుగా వింటున్నాం. ఇంతకీ ఐసోలేషన్ అంటే ఏంటంటే.. వైరస్ సోకిన రోగిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా..

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 6:01 PM

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసోలేషన్, క్వారంటైన్ అనే పదాలను మనం తరుచుగా వింటున్నాం. ఇంతకీ ఐసోలేషన్ అంటే ఏంటంటే.. వైరస్ సోకిన రోగిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఎలాంటి వస్తువులను తాకనివ్వకుండా.. అతడికి చికిత్స అందించడం. ఐసోలేషన్‌లో ఉంచడం అంటే పూర్తిగా వేరే వాళ్లకు వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవడం. ఇక క్వారంటైన్ అంటే వైరస్ సోకిందేమో అనుమానంతో.. మిగిలిన వారికి దూరంగా కొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచడం. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లంతా రోగులు కాదు.

కాగా.. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లకు 15 రోజుల తరువాత రెండు సార్లు కరోనా టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నెగిటివ్ అని వస్తే ఆ వ్యక్తి ఇంటికి పంపిస్తారు. ఇదే ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా పాటిస్తారు. అలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఓ నెల రోజుల పాటు ఎవరికీ సంబంధం లేకుండా ఓ ఇంటిలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నెగిటివ్ వచ్చిన తరువాత కూడా మరలా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనతోపాటు కుటుంబ సభ్యులు, చుట్టు ప్రక్కల వారికి కూడా సేఫ్‌గా ఉంటారు. కాగా ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా 8,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 273 మంది మరణించారు. అలాగే 765 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 7409 కేసులు ఆక్టీవ్‌గా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?