హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ మనకి తెలియకుండానే మన సమాచారం వేరొకరి చేతిలో ఉంటుంది. ఎన్ని రకాలుగా నియంత్రణలు పెట్టినా.. వారు ఎంతో ఈజీగా అన్నింటినీ హ్యాక్ చేస్తూంటారు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఇప్పటికి ఎంతో మందిని బెదిరించి..

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 5:03 PM

ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ మనకి తెలియకుండానే మన సమాచారం వేరొకరి చేతిలో ఉంటుంది. ఎన్ని రకాలుగా నియంత్రణలు పెట్టినా.. వారు ఎంతో ఈజీగా అన్నింటినీ హ్యాక్ చేస్తూంటారు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఇప్పటికి ఎంతో మందిని బెదిరించి.. ప్రాణాలను, మానాలను దోచుకుంటున్నారు హ్యాకర్లు. మనం చూసేవి పక్క వ్యక్తికి కూడా తెలీదు అనుకుంటాం.. కానీ అదే వారికి ప్లస్ పాయింట్.

చిన్న వీక్‌నెస్‌లను ఆసరాగా చేసుకొని ఎంతో మందిని అడ్డంగా దోచుకుంటున్నారు. అలా మన సమాచారాన్ని ఎవరి కంటా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకు ప్రత్యేక దారులున్నాయి. అవన్నీ ప్రైవేటు దారులే. వాటిని ఎవరూ కనిపెట్టలేరు. వాటానే టెక్నాలజీ పరిభాషలో ‘వీపీఎన్‌(VPN)’లని పిలుస్తారు. ఇవి ఇప్పుడు యాప్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడినట్లైతే మీ ఐపీ అడ్రస్ గుట్టుని కాపాడుతూ.. మీ నెట్టింటి సెక్యూరిటీకి రక్షణగా నిలుస్తాయి.

అవి: 1. హాట్‌స్పాట్ షీల్డ్ – Hotspot shield 2. విండ్‌స్క్రైట్ – Windscribe 3. ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ – Express VPN 4. టన్నెల్‌బేర్ – Tunnelbear 5. వైపర్ వీపీఎన్ – Vypr VPN

వీటికి సంబంధించిన నెట్‌వర్క్స్‌‌లోకి లాగిన్ అయి నెల రోజుల పాటు వీటి సేవలను ఉచితంగా పొందవచ్చు. మీకు నచ్చినట్లయితే తదుపరి నెల నుంచి సేవలు వినియోగించుకనేందుకు సబ్‌ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!