రైల్వే ప్రయాణీకులకు మరో శుభవార్త…

జూన్ 1 నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్‌ను నడపనున్న రైల్వేశాఖ.. ఆ రైళ్ల టికెట్లను ఇకపై పోస్టాఫీసులు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, IRCTC ఏజెంట్ల, PRS కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే మే 12 నుంచి రాజధాని రూట్లలో నడుపుతున్న 30 రైళ్లకు కూడా 30 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మే 24 నుంచి బుక్ చేసుకునే టికెట్లకు, మే 31 నుంచి నడిచే […]

  • Ravi Kiran
  • Publish Date - 11:41 pm, Fri, 22 May 20
రైల్వే ప్రయాణీకులకు మరో శుభవార్త...

జూన్ 1 నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్‌ను నడపనున్న రైల్వేశాఖ.. ఆ రైళ్ల టికెట్లను ఇకపై పోస్టాఫీసులు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, IRCTC ఏజెంట్ల, PRS కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే మే 12 నుంచి రాజధాని రూట్లలో నడుపుతున్న 30 రైళ్లకు కూడా 30 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మే 24 నుంచి బుక్ చేసుకునే టికెట్లకు, మే 31 నుంచి నడిచే ప్రత్యేక రైళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. కాగా, ఏ రైలుకు తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ సౌకర్యం లేదని రైల్వే శాఖ వెల్లడించింది.

రైలు టికెట్ బుకింగ్‌లో మారిన రూల్స్ ఇలా ఉన్నాయి…

  • ప్రత్యేక రైళ్లలో RAC, వెయిటింగ్ లిస్టు టికెట్ల సౌకర్యం ఉంది.
  • వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారికి స్టేషన్లలోకి అనుమతించరు.
  • టికెట్ కన్ఫామ్ అయిన వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతి.
  • రైలు బయల్దేరే 4 గంటల ముందు మొదటి చార్ట్.. అలాగే రెండు గంటల ముందు రెండో చార్ట్ సిద్దమవుతాయి.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..