జేఎన్టీయూ కీలక నిర్ణయం.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన బీటెక్ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్టీయూహెచ్ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఫైనల్ ఇయర్ పరీక్షలను.. అలాగే జూలై 16 నుంచి బీటెక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని వర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. కాగా, ప్రైవేట్ కాలేజీలకు 2020- […]

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..
Follow us

|

Updated on: May 22, 2020 | 5:43 PM

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన బీటెక్ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్టీయూహెచ్ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఫైనల్ ఇయర్ పరీక్షలను.. అలాగే జూలై 16 నుంచి బీటెక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.

మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని వర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. కాగా, ప్రైవేట్ కాలేజీలకు 2020- 21 విద్యా సంవత్సరానికి గానూ ఇచ్చే అఫిలియేషన్‌ను తనిఖీలు చేయకుండానే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా స్వీకరించే దరఖాస్తులు, ఆయా కాలేజీలు ఇచ్చే అఫిడవిట్లను పరిశీలించి అఫిలియేషన్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.

Read More:

తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. బ్రేక్ చేస్తే బాదుడే.!

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..

ఏపీలో 44, తెలంగాణలో 18 రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్..