‘అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా’..? భువనగిరి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 58 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ తన ప్రాణం పోయినా బీజేపీకి లొంగను అని భావోద్యేగ ప్రసంగం ఇచ్చారు. తన బిడ్డ కవితను అన్యాయంగా జైలులో కూర్చోబెట్టారన్నారు. దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులగురించి వార్తలు వింటున్నామన్నారు. డాలర్ తో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిందని చెప్పారు.

'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? భువనగిరి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్..
Kcr
Follow us

|

Updated on: Apr 25, 2024 | 9:33 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 58 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ తన ప్రాణం పోయినా బీజేపీకి లొంగను అని భావోద్యేగ ప్రసంగం ఇచ్చారు. తన బిడ్డ కవితను అన్యాయంగా జైలులో కూర్చోబెట్టారన్నారు. దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులగురించి వార్తలు వింటున్నామన్నారు. డాలర్ తో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిందని చెప్పారు. ఒకపార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని బస్సుయాత్రలో ప్రస్తావించారు. మరో పార్టీ ఎక్కడికి పోతే అక్కడ దేవునిపై ఒట్టు అంటోందని చురకలు అంటిచారు. బీజేపీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా నింపడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో తలమానికంగా నిలిచే కట్టడం యాదాద్రిని నిర్మించి ఏనాడైనా ఓట్ల కోసం వాడుకున్నామా అని ప్రజలను అడిగారు.

భువనగిరిలో కాంగ్రెస్-బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో ర్యాలీలు చేస్తారు.. వాటితో మన కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలన్నారని, లేకుంటే ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించినట్లు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవ్వమని చెప్పినట్లు తెలిపారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదని విమర్శించారు. ఢిల్లీకి 50 సార్లు వెళ్లి మొరపెట్టుకున్నట్లు ప్రజలకు తెలియజేశారు. బీజేపీ వల్ల తెలంగాణ భారీగా నష్టపోయిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి అయిన బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని నిలదీశారు. తన వయసు గురించి ప్రస్తావిస్తూ రానున్నది మీ భవిష్యత్తు, తెలంగాణ మీదంటూ ప్రజల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో వలసలు పెరిగాయని, ఆటోలు నడుపుకుంటూ ప్రజలు జీవనం సాగించేవారని విమర్శించారు. వ్యవసాయాలు మూలనపడినట్లు ఇలా అనేక రకాల బాధలు పడినట్లు తెలిపారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగొద్దని ప్రజలు తెలివితో ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ను గెలిపించండని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..