Telangana: కోడంగల్‌లోనా.. అమరవీరుల స్థూపం దగ్గరైనా సరే.. తేల్చుకుందాం రా! సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎన్నికల్లో మరింత వేడిని రగిలిస్తోంది. తెలంగాణకు నాడు యూపీఏ, నేడు ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అమరవీరుల స్థూపం దగ్గరైనా.. కోడంగల్‌లోనా, కృష్ణ గోదావరి నది ఒడ్డునైనా సరే.. చర్చకు సిద్ధమన్నారు.

Kishan Reddy Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: May 05, 2024 | 8:06 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎన్నికల్లో మరింత వేడిని రగిలిస్తోంది. తెలంగాణకు నాడు యూపీఏ, నేడు ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అమరవీరుల స్థూపం దగ్గరైనా.. కోడంగల్‌లోనా, కృష్ణ గోదావరి నది ఒడ్డునైనా సరే.. చర్చకు సిద్ధమన్నారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని, ఈ పదేళ్ల కాలంలో గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి, తన ప్రచార సభలో పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చిన నిధులు ఎన్ని? చర్చకు ఆహ్వానిస్తూ కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

గత పదేళ్లలో తెలంగాణకు మోదీ సర్కార్ రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాము లెక్కలుతో సహా నిరూపిస్తామని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్ రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోదీ ఏం చేశారో తాను వివరిస్తానని, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని ఆ లేఖలో సవాల్ చేశారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..

ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!

పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి

హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..

బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...

ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు

నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..

2025లో రిలీజ్ కోసం నయా కార్ల క్యూ..ముందు వరుసలో ఆ కంపెనీల కార్లు

చిత్రమైన పాము.. తులసి మొక్కను వీడటం లేదు..