దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ ఇచ్చినా కూడా లెక్కకు మించి అభిమానులు రావడంతో చివరి నిమిషంలో అది రద్దు అయిపోయింది. ఇక ప్రీమియర్స్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఇండస్ట్రీపై భారీ ఎఫెక్ట్ చూపించింది. ఈ రెండు ఘటనల తర్వాత కొన్ని పరిస్థితులు మారిపోయాయి.. అందుకే అనుమతులు కాస్త కష్టం అవుతున్నాయి.