- Telugu News Photo Gallery Cinema photos Shankar Told openly about which Telugu heroes he tried to make films
Shankar: తెలుగులో ఆ హీరోల కోసం ట్రై చేసిన శంకర్.. వారెవరు.?
నేను తమిళ్‌లో సినిమాలు చేశాను. హిందీలో చేశాను. కానీ తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా మాత్రం గేమ్ చేంజర్. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆహ్వానిస్తున్నారు.. ఆదరిస్తున్నారు... అని చెబుతూనే, ఇప్పటిదాకా తాను తెలుగులో ఏయే హీరోల కోసం ట్రై చేశారో ఓపెన్‌గా చెప్పేశారు శంకర్. ఇంతకీ శంకర్ దృష్టిలో ఉన్న హీరోలు ఎవరు?
Updated on: Jan 04, 2025 | 3:11 PM

గేమ్ చేంజర్ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి కెప్టెన్ శంకర్‌కి. ఇన్‌ఫ్యాక్ట్ ఈ సినిమా సక్సెస్ ఆయన కెరీర్‌కి కూడా చాలా చాలా కీలకం. అందుకే ప్రతి ఫ్రేమ్‌నీ శ్రద్ధగా తీశారనే టాక్ స్ప్రెడ్ అయింది.

క్లైమాక్స్‌లో చెర్రీ నటనకు నేషనల్ అవార్డు గ్యారంటీ అంటూ సుకుమార్ చెప్పిన మాటలు, సినిమా మీద హైప్ పెంచేశాయి. వింటేజ్ శంకర్ గుర్తుకొస్తారని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు సుకుమార్.

అసలు చరణ్‌తో సినిమా చేయడానికన్నా ముందే చిరంజీవితో మూవీ ప్లాన్ చేశారట శంకర్. అయితే అది ఎందుకో వర్కవుట్ కాలేదన్నారు. అప్పుడు తండ్రితో కాకపోతేనేం.. ఇప్పుడు కొడుకుతో మూవీ చేశారు కెప్టెన్. అన్నట్టు.. గేమ్ చేంజర్‌కి దారి ఇవ్వడానికి విశ్వంభరను పోస్ట్ పోన్ చేసి తనవంతు సాయం చేశారు చిరు.

గేమ్ చేంజర్ సినిమా గురించి చెబుతూ ఒక్కడు, పోకిరి లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్కితన మార్క్ సోషల్ కాజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది... అంటూ స్ట్రాంగ్‌గా చెప్పారు శంకర్. అన్నట్టు.. మహేష్‌తోనూ మూవీ చేయాలని అనుకున్నారట శంకర్. ఆ మధ్య ఆ వార్త కూడా చాలా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు శంకర్ స్టేట్‌మెంట్‌తో... ఫ్యూచర్‌లో అయినా చేసే అవకాశం ఉందా? అంటూ ఇష్టంగా చూస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తోనూ కరోనా టైమ్‌లో చర్చలు జరిపానన్నారు శంకర్. అది కూడా ఎందుకో వర్కవుట్ కాలేదన్నది స్టార్ డైరక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్. డార్లింగ్ కటౌట్‌కి, శంకర్ మార్క్ కంటెంట్ తోడైతే, పిక్చర్ పాన్ ఇండియా హద్దులు దాటేయడం ఖాయం అంటున్నారు రెబల్ డై హార్డ్ ఫ్యాన్స్.




