Samantha: ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..

మొదట్లో ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ తో ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. మూవీ ఈవెంట్స్.. టీవీ షోస్.. అవార్డ్ వేడుకలలో కొత్త రకం డ్రెస్ ధరించి సందడి చేస్తుంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఈసారి మాత్రం ఉర్ఫీ డ్రెస్ పై ప్రశంసుల కురిపిస్తున్నారు నెటిజన్స్.

Samantha: ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..
Samantha, Urfi
Follow us

|

Updated on: May 05, 2024 | 11:20 AM

ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా వాడేవారికి పరిచయం అవసరం లేని పేరు. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ప్రత్యేకం. ఎప్పుడూ ఏదోక డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లో కనిపిస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తుంది. విభిన్నమైన దుస్తులు ధరించి నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా కొత్త కొత్త ట్రెండ్ దుస్తులతో నెట్టింట అగ్గిరాజేస్తుంది. మొదట్లో ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ తో ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. మూవీ ఈవెంట్స్.. టీవీ షోస్.. అవార్డ్ వేడుకలలో కొత్త రకం డ్రెస్ ధరించి సందడి చేస్తుంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఈసారి మాత్రం ఉర్ఫీ డ్రెస్ పై ప్రశంసుల కురిపిస్తున్నారు నెటిజన్స్.

మొదటిసారి ఉర్ఫీ డ్రెస్సింగ్ పై సామాన్యులు, సెలబ్రెటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే.. ఈసారి అందమైన సీతాకోక చిలుకల రెక్కలు విదుల్చుతూ కనిపించింది. ఇటీవల ఓ ఈవెంట్లో ఉర్ఫీ పసుపు రంగు పువ్వులు.. రంగు రంగుల సీతాకోకచిలుకలతో అలరించిన మ్యాజికల్ బ్లాక్ గౌను ధరించింది. ఉర్ఫీ న్యూ డ్రెస్ అక్కడున్నవారినే కాకుండా అభిమానులను, సెలబ్రెటీలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు ఉర్ఫీ డ్రెస్సింగ్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సమంత రియాక్ట్ అయ్యారు.

ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై గౌనుకు సమంత ముగ్దులయ్యింది. బ్యూటీఫుల్ ఉర్ఫీ అంటూ కామెంట్ చేస్తూ ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. అలాగే ఆ డ్రెస్ పై తన ప్రేమను తెలిపేందుకు హార్ట్ ఎమోజీలను షేర్ చేసింది. అలాగే మృణాల్ రియాక్ట్ అవుతూ.. లవ్ అంటూ కామెంట్ చేసింది. ఇక టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ..ఫైర్ సింబల్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఉర్ఫీ బ్లాక్ మ్యాజికల్ బట్టర్ ఫ్లై గౌను వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఉర్ఫీ.. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అలాగే ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.