18 May 2024
సైలెంట్ అయిన సీతామహాలక్ష్మి.. మృణాల్‌ను మేకర్స్ పట్టించుకోవట్లేదా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
కుంకుమ్ భాగ్య సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
హిందీ, మరాఠీ చిత్రాల్లో దాదాపు 10 సినిమాల వరకు నటించిన మృణాల్.. హనురాఘవపూడి డైరెక్షన్లో సీతారామం సినిమాలో నటించింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుంది.
తొలి చిత్రంతోనే అద్భుతమైన నటనతో మెప్పించిన మృణాల్.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరించింది.
తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారి నచ్చితే ఆమెకు స్టార్ స్టేటస్ ఇచ్చేస్తారన్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే మృణాల్‌కు తెలుగులో క్రేజ్ వచ్చింది.
సీతారామం తర్వాత నాని సరసన హాయ్ నాన్న మూవీతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించింది.
ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ సందడి తగ్గిపోయింది. ఈ అమ్మకు సరైన ఆఫర్ రావడం లేదనిపిస్తుంది.
ఫస్ట్ మూవీ నుంచి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాల్.. ఇప్పుడు సైలెంట్ అయినట్లు కనిపిస్తుంది. తెలుగులో గ్రాఫ్ పడిపోయినట్లు టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి.